Vastu Tips: వాస్తు భారతీయ వాఙ్మయాల్లో చాలా ప్రాముఖ్యం కలిగినది. వాస్తు ప్రకారం మనం ఉండే స్థలం, ఇల్లు వాటిలో మనం వివిధ వస్తువులను, పాత్రలను ఉంచడానికి ఎంపిక చేసే స్థలాలు శాస్త్రీయంగా ఉండాలి. లేకపోతే నెగెటివ్ ఫలితాలు పొందుతాము. ఇక సరైన పద్దతిలో ఉంచడం వల్ల మంచి ఫలితాలు పొంది సుఖంగా ఉంటాము. కాబట్టి వాస్తు విజ్ఞులు చెప్పిన సలహాలు, సూచనలు తప్పకుండ పాటిస్తారు చాలా మంది. అయితే ఇంట్లో ఏ మూలల్లో ఏమి ఉంచడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతామో ఇక్కడ చదవండి..
ఆర్ధికంగా ఉత్తమ ఫలితాలు అందించే దిశలుగా ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశలను తెలుపుతారు. కావున ఈ దిశల్లో వాస్తు దోషాలు దొర్లితే అవి అనేక సమస్యలతో పాటు.. ఆర్ధిక సమస్యలకు దారితీస్తాయి. ఈ దిశల్లో వాస్తు తప్పిదాలు చేయకుండా ఉండడం వల్ల సమస్యలు నుండి గట్టెక్కడమే కాకుండా.. మంచి ధనప్రాప్తి పొందవచ్చని పండితుల మాట.
పండితుల సూచనల ప్రకారం..
> నీటి ట్యాంక్ దిశ.. ఇంటి ఉత్తర దిశలో ఉండాలి. నీటి తొట్టిలో ఒక శంఖం, వెండి నాణెం, వెండి తాబేలు ఉంచడం మంచి ఫలితాన్నిస్తుంది.
> ఉత్తర దిశలో డబ్బు.. సంపద అధిపతి కుబేరుడు ఉత్తర దిశలో ఉంటాడు కావున డబ్బు నిల్వ ఉత్తరాన ఉంచాలి.
> వినాయకుడు, లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలి. ఇక్కడ నెయ్యి దీపం వెలిగించడం మంచి ఫలితాన్నిస్తుంది.
> తులసి, ఆమ్లా, ఉసిరి మొక్కలు ఉత్తరం దిక్కున పెంచాలి.
> ఒక గాజు గిన్నె లో వెండి నాణెం వేసి ఉత్తర దిశలో ఉంచాలి.
> ఇంటికి ఉత్తర దిశలో నీలిరంగు పిరమిడ్‌ను ఉంచడం శుభప్రదం.. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరిసేలా చేస్తుంది.
Vastu Tips:
పైన పేర్కొన్న వాస్తు సూచనలు పాటించడం ద్వారా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవడమే కాకుండా.. మంచి ఆర్ధిక ఫలితాలను పొందుతారు. ఇవి మీ కుటుంబ ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి ఉపకరిస్తాయి. కావున ఇలాంటి వాస్తు సూచనలు పాటించండి. లేదా మీరు నమ్మే వాస్తు పండితులను కలిసి వారి సలహాలు తీసుకోండి.