Superstar Krishna తెలుగు చిత్ర సీమలో సీనియర్ హీరో అయిన సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యం బారిన పడ్డారు. ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. మరో రెండు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని తెలుస్తోంది.
సూపర్ స్టార్ కృష్ణ కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో సఫర్ అవుతున్నారు. అనారోగ్య సమస్యలతో ఆయన కనీసం ఇంటి నుంచి కూడా బయటకు రావడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అలనాటి దిగ్గం, చాలా మందికి ఫేవరెట్ హీరో అయిన సూపర్ స్టార్ కృష్ణ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంపై సినీ నటుడు నరేష్ స్పందించారు. కృష్ణకు స్వల్ప అస్వస్థత కలిగిందని వివరించారు. ఆయనకు శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో హుటాహుటిన ఆదివారం ఆస్పత్రిలో చేర్పించినట్లు నరేష్ చెప్పారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో నిపుణులైన వైద్య బృందం కృష్ణకు చికిత్స అందిస్తోందని వెల్లడించారు.
Superstar Krishna ఆరోగ్యం నిలకడగానే ఉంది..
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని నరేష్ చెప్పారు. 24 గంటల తర్వాత సూపర్ స్టార్ కృష్ణను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తారని నరేష్ తెలిపారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై వైద్యులు కూడా స్పందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. జనరల్ టెస్టుల కోసం ఆస్పత్రికి వచ్చారని చెప్పారు. కాగా, కృష్ణ ఆరోగ్యం గురించి ఆందోళన అవసరం లేదని సన్నిహితులు భరోసా ఇస్తున్నారు.