Best Winter Fruits: సీజనల్ గా దొరికే పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే ఇలా ఏ సీజన్ లో లభించే పండ్లు ఆయా కాలాల్లో తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇక సీజనల్ వ్యాధులకు సీజనల్ పండ్లు మంచి ఔషధాలుగా పనిచేస్తాయని చెబుతారు నిపుణులు. చలికాలంలో లభించే కొన్ని రకాల పండ్లు రోగనిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయి. ఇక పిల్లల ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. కాబట్టి ఈ పండ్లని చలికాలంలో మీ పిల్లలకు తప్పక తినిపించండి.
చలికాలంలో.. ఈ పండ్లు తప్పక తినాలి..
ఉసిరి: ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరచడం, వెంట్రుకలు పెరుగుదల, చర్మం, కళ్ల ఆరోగ్యానికి ఉసిరి ఉపయుక్తం.
నారింజ: నారింజలో విటమిన్ C పుష్కలంగా లభిస్తుంది. పొటాషియం, ఫోలేట్ లు కూడా నారింజలో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
నల్ల ద్రాక్ష: చలికాలంలో దొరికే పళ్లలో ముఖ్యమైనవి నల్ల ద్రాక్ష. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విటమిన్ C తో పాటు.. నల్ల ద్రాక్షలోని పోషకాలు పిల్లల గుండెకు చాలా మేలు చేస్తాయి.
దానిమ్మ: చలికాలంలో పిల్లలు తినాల్సిన పళ్లలో దానిమ్మ కూడా ముఖ్యమైనది. ఇందులో విటమిన్ C, E, K, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం, ఐరన్ ఉంటాయి.
పైన పేర్కొన్న పళ్ళతో పాటు.. క్యారెట్, జామ, అరటి, కివీ పండ్లను తినిపించాలి. ఇవి వివిధ రకాల విటమిన్లతో పాటు, యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ పోషకాలను మీ పిల్లలకు అందిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బాక్టీరియా, వైరస్, ఫ్లూ వంటి వాటి బారిన పడకుండా పిల్లలను రక్షిస్తాయి.
Best Winter Fruits:
ఇక కొందరు పిల్లలు పండ్లు తినడానికి ఇష్టపడరు. వారికి పండ్లను నేరుగా కాకుండా సలాడ్స్, ముక్కలుగా కోసి.. అలా వివిధ రూపాల్లో అందించాలి. ఉదయం టిఫిన్ సమయంలో, లంచ్ సమయాల్లో ముక్కలుగా కోసి ఇవ్వవచ్చు. కొందరు జూస్ లు తాగడానికి ఇష్టపడతారు. కానీ జూస్ ల కంటే నేరుగా తినిపించడం మంచిది. ఇలా తినడం ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చు.