సరైన వైద్యం అందక చాలా మంది చనిపోతుండడంతో కూతుర్ని డాక్టర్ చేయాలనుకుంటుంది ఆ తల్లి. పెద్దయ్యాక డాక్టర్ అయి పేదవాళ్లక ఉచితంగా వైద్యం చేస్తానని నాకు మాటివ్వమంటూ కృష్ణ దగ్గర మాట తీసుకుంటుంది. నాన్నని, నిన్ను బాగా చూసుకుంటానని కృష్ణ అంటుంది. నేను ఎక్కువ కాలం బతకను కదమ్మా అంటూ ఆ తల్లి విలవిలలాడిపోతుంది. ఆ తర్వాత సీన్‌లో కృష్ణ పెద్దగా మారుతుంది. వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్లి హ్యాపీ బర్త్ డే నాన్నా అని అరుస్తుంది. ఆ తర్వాత సీన్‌లో ఒక వ్యక్తి కృష్ణ కోసం ఎదురు చూస్తాడు. ఇద్దరు పిల్లలు వచ్చి మా అక్కని పెళ్లి చేసుకునేది నువ్వేనా అంటూ అతడ్ని టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత కృష్ణ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. నేను వరుణ్‌ని అంటూ అతడు పరిచయం చేసుకుంటాడు. పెళ్లి చూపులకు ఇలా పొద్దున్నే రావడం ఏంటని వరుణ్ అడగ్గా.. నా మనసులో మాట చెప్దామని ఇలా కలిశాను అంటుంది కృష్ణ. డాక్టర్ అవ్వాలి అనేది నా కల. అలాగే నేను మీకు నచ్చి నన్ను పెళ్లిచేసుకుంటే మా నాన్న కూడా నాతో పాటే జీవితమంతా ఉంటారని అంటుంది కృష్ణ. దానికి నేనే కాదు ఎవ్వరూ ఒప్పుకోరని అంటాడు వరుణ్. అయితే ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్తుంది కృష్ణ.
వెళ్లిపోతున్న కృష్ణని వేరే ఆప్షన్ లేదా అని అడుగుతాడు వరుణ్. మా నాన్నని గౌరవించని వాడి ముఖం కూడా నేను చూడనంటూ వెళ్లిపోతుంది కృష్ణ. అక్కడ కృష్ణ తండ్రి కూడా ఈ పెళ్లి జరగదని బాధపడతాడు. నా కూతరితో నా బంధం విడదీయరానిదే అయినా విడిపోక తప్పదని అనుకుంటాడు. ఆ తర్వాత పిల్లలతో కలిసి వెళ్తున్న కృష్ణకు ఓ వ్యక్తి అడ్డుపడతాడు. తనని లవ్ చేస్తున్నానని చెప్తాడు. మా నాన్న నాకోసం ఎదురు చూస్తున్నాడని వెళ్లిపోతానంటుంది కృష్ణ. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా అంటూ పెద్ద ప్లెక్సీ చూపిస్తాడు. నీ మీద నా ప్రేమ ఏంటో ఇక్కడ రాయి అంటూ స్కెచ్ ఇస్తాడు కృష్ణకు. లూసర్ అంటూ రాసిన కృష్ణ రాతని తప్పుగా అర్థం చేసుకుని తనని లవ్ చేస్తుందనుకుంటాడు అతడు.
పోలీస్ డ్రెస్‌లో ఉన్న తండ్రి పుట్టిన రోజు జరపాలనుకుంటుంది కృష్ణ. వద్దనడంతో తల్లి ఫొటో దగ్గరకు వెళ్లి చెప్తుంది కృష్ణ. తండ్రీకూతుళ్లిద్దరూ అక్కడ వాదించుకుంటారు. నేను చస్తే గాని నీ పెళ్లి జరగదని తండ్రి అనడంతో.. అలా మాట్లాడకండి నాన్నా అంటూ ఏడుస్తూ వెళ్తుంది కృష్ణ. అలిగిన కూతుర్ని బుజ్జగిస్తాడు తండ్రి. మీ పుట్టిన రోజుకు నాకు గిఫ్ట్ ఇస్తారు కదా ఈసారి ఏం ఇస్తారని అడుగుతుంది కృష్ణ. అడగమని తండ్రి చెప్పగా మనం ఈ ఊరు విడిచి హైదరాబాద్ వెళ్దామంటుంది కూతురు. కొత్త ఏసీపీ కొద్దిరోజుల్లోనే వస్తాడు ఆ తర్వాత మనం వెళ్దామంటూ హామీ ఇస్తాడు తండ్రి.
ఆ తర్వాత ఓ వ్యక్తి గుర్రం మీద వస్తాడు. పోస్ట్‌మేన్ వచ్చి మురారి ఎవరు అంటూ లెటర్ ఇస్తారు. మా ఇంట్లో వాళ్లందరి గురించి నువ్ తెలుసుకోవాలి అంటూ మురారి తల్లి, తండ్రిని పరిచయం చేస్తాడు. ఆ తర్వాత మురారి ఐపీఎస్ పోస్టింగ్ ఆర్డర్ అంటూ ఇంట్లోని వాళ్లకు చెప్తాడు. ముందు వాళ్లమ్మకు ఇవ్వమంటాడు మురారి తండ్రి. నా కల, మురారి ఆశయం ఇన్నాళ్లకు నెరవేదరిందంటూ ఒకావిడ సెల్యూట్ చేస్తుంది. ఆ తర్వాత మురారి వచ్చి లెటర్ తీసుకుని తన కాళ్లకి దండం పెడతాడు. పోస్టింగ్ ఆదిలాబాద్‌లో అని మురారి చెప్పగానే కంగారు పడతాడు తండ్రి. భయపడాల్సింది మనం కాదు వాళ్లు అంటుంది ఆ పెద్దావిడ.
టాటూ వేసే అతడ్ని పిలిపించి టాటూ వేయమంటాడు కృష్ణని లవ్ చేస్తున్న వ్యక్తి. అది అవర్ కాదన్నా.. లూసర్ అంటూ చూపిస్తాడు ఆ వ్యక్తి. దాంతో కోపంతో రగిలిపోతాడు. అక్కడ తండ్రి బర్త్‌డేని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేస్తుంది కృష్ణ. అంతలోనే ఓ అమ్మాయి ఫోన్ చేసి నన్ను కాపాడండి అంటూ వేడుకుంటుంది. నన్ను వదిలేసి వెళ్లొద్దు నాన్నా అని కృష్ణ ఎంత వేడుకున్నా తప్పదమ్మా అనుకుంటాడు వెళ్తాడు. కృష్ణని ప్రేమించిన వ్యక్తి ఇంటికి వచ్చి తనని ఏడిపిస్తాడు. 12వ తేదీ ఉదయం కృష్ణ వెడ్స్ శివ.. ఇది ఫిక్స్ అంటాడు. డాక్టర్ కావాలన్న నీ కల మరిచిపోయి భవిష్యత్తు ఆలోచించమని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం..