కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడిలో దీపాలు పెట్టేందుకు వెళుతుంది దీప. అదే సమయంలో కార్తీక్‌ని తీసుకుని మోనిత వస్తుంది. మోనిత నుంచి తప్పించుకుని దీపతో కలిసి దీపాలు వెలిగిస్తాడు కార్తీక్. అది చూసి కోపంతో ఊగిపోతుంది మోనిత. ఆ తర్వాత నవంబర్ 14 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి కాగానే కొలనులో దీపాలు వదలడానికి వెళుతుంటుంది దీప. అదే సమయంలో అక్కడికి వచ్చిన మోనిత.. దీపపై కోపంతో అరుస్తుంది. కార్తీక్‌కి తన ప్రేమ అర్థం కాట్లేదని, దీపకి తనంటే భయం లేదని, ఇద్దరికీ తనలోని రాక్షసిని చూపిస్తానని కోపంగా అరుస్తుంది మోనిత. అది విని కార్తీక్‌కి ఏదైనా కీడు తలపెట్టాలని చూస్తే తన అంతు చూస్తానని మోనితకి వార్నింగ్ ఇస్తుంది దీప.
మరోవైపు.. ఆనంద్‌తో చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటుంది హిమ. ఇంతలో అక్కడికి వచ్చిన ఆనందరావు.. మరుసటి రోజు సౌందర్య రాబోతోందని చెబుతాడు. అనంతరం, ఆనంద్ గురించి మోనిత అసలు పట్టించుకోట్లేదని విసుక్కుంటుంది హిమ. అలాగే.. తన తల్లి దీప అయితే ఎంత ప్రేమగా ఉండేదో అని బాధగా చెబుతుంది హిమ. అలాగే.. సౌర్య అనుకుంటున్నట్లు అమ్మనాన్న బతికే ఉన్నారేమో అని అనుమానంగా అంటుంది హిమ. అది విని.. నువ్వు కూడా ఇల్లు వదిలి వెళ్లిపోతే తాము తట్టుకోలేమని బాధగా అంటాడు ఆనందరావు. అలాగే.. దీప, కార్తీక్ లేరనే విషయం సౌర్యకి అర్థమయ్యేలా చెప్పి తనని ఇంటికి తీసుకువస్తానని అంటాడు ఆనందరావు.
ఇంకోవైపు.. కొలనులో దీపాలు వదిలేందుకు సిద్ధమవుతుంది దీప. ఇంతలో అక్కడికి వచ్చిన మోనిత.. దీపని అందులోకి నెట్టాలని అనుకుంటుంది. వెనుక నుంచి తనని నెట్టబోతుండగా.. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్, మోనితని లాక్కెళ్లిపోతాడు. అలాగే.. అందరి ముందు దీపని చంపాలనుకుంటున్నావా అని నిలదీస్తాడు. దాంతో.. తనతో గుడికి వచ్చి వంటలక్కతో కలిసి దీపాలు వెలిగిస్తావా అని కోపంగా అరుస్తుంది మోనిత. అది విని.. ‘నేను నీ భర్తనా లేక వంటలక్క భర్తనా’ అని కోపంగా అడుగుతాడు కార్తీక్. దానికి.. ఇంకోసారి వంటలక్కని కలవకూడదు అని మాటివ్వమని నిలదీస్తుంది మోనిత. లేకపోతే తగలబెట్టుకుంటానని దీపంతో పట్టుకుంటుంది మోనిత. అది చూసి.. డాక్టర్ బాబుతో తను మాట్లాడతానని, తగలబెట్టుకో లేకపోతే తనే తగలబెడతానని కోపంగా అంటుంది దీప. దాంతో.. తనకి దక్కని వాడిని నీకు దక్కనివ్వను అని.. ఇద్దరిలో ఒకరిని చంపేస్తానని దీపకి వార్నింగ్ ఇస్తుంది మోనిత.
అక్కడ.. ఇంద్రుడు, చంద్రమ్మ మాటలనే తలచుకుని బాధపడుతుంటుంది సౌర్య. అది గమనించిన ఇంద్రుడు, చంద్రమ్మ.. సౌర్యని తన అమ్మనాన్న దగ్గరకి చేర్చాలని, అప్పుడే తమని నమ్ముతుందని అనుకుంటారు. నిజానికి అదంతా నాటకం. అది తెలియని సౌర్య.. ఇంద్రుడిని కౌగిలించుకుని బాధ పడుతుంది. ఇంకోవైపు.. మోనిత వార్నింగ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది దీప. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్.. దీప తినడానికి టిఫిన్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇదంతా చాటుగా గమనించిన మోనిత.. కోపంతో ఊగిపోతుంది. తనని పట్టించుకోకుండా వంటలక్క కోసం వచ్చాడని ఆవేశంగా అనుకుంటుంది మోనిత. అలాగే.. కార్తీక్ గతం గుర్తొచ్చిందేమోననే అనుమానం మోనితలో ఇంకా బలపడుతుంది.
ఉదయమే.. గుడిని శుభ్రం చేస్తుంటుంది దీప. ఇంతలో అక్కడికి వచ్చిన పూజారి దీపాల కార్యక్రమం ఎలా జరిగిందని అడుగుతాడు. దాంతో.. భర్త, పిల్లల గురించి చెప్పి బాధ పడుతుంది దీప. అది విని.. సీతమ్మలాగా తనని కష్టాలు చాలా ఉన్నాయని, కష్టాలు త్వరలోనే తీరిపోతాయని ధైర్యం చెబుతాడు పూజారి. అనంతరం.. తన బాధలు ఎప్పుడు తీరిపోతాయని దేవుడి విగ్రహాన్ని చూసి బాధ పడుతూ.. తన కుటుంబాన్ని త్వరగా తన దగ్గరకి చేర్చమని కోరుకుంటుంది దీప. ఇంకోవైపు.. ‘కార్తీక్ ప్రవర్తన చూసి వంటలక్కని భార్య చూస్తున్నాడు. తనకి గతం గుర్తొచ్చిందా లేదా అని అనుమానంగా అనుకుంటుంది మోనిత. ఇంతలో కార్తీక్ ఫోన్‌లో ఎవరితో మాట్లాడడం వింటుంది. మోనితకి నిజం తెలిసిందో లేదో తరువాతి ఎపిసోడ్‌లో చూడండి.