Viral Video: కోలంబియాకు చెందిన డయానా రమిరెజ్ తన అందంతోనే కాదు.. విన్యాసాలతో అందరికీ ఆకట్టుకుంటోంది. ఆమె చేసే విన్యాసాలు అందరినీ అబ్బరపరుస్తోన్నాయి. ఆమె విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. స్టంట్లు, జంప్ లు చేస్తూ తన విన్యాసాలతో అందరినీ ఆకట్టుకుంటోంది ఈ అందమైన లేడీ ఆఫీసర్. ప్రపంచంలోనే అందమైన లేడీ ఆఫీసర్ గా ఆమె పేరు తెచ్చుకుంది.
మోడలింగ్ అంటే డయానా రమిరెజ్ కు చాలా ఇష్టం. కానీ పోలీస్ ఉద్యోగం అంటే తనుకు ఇంకా చాలా ఇష్టమని, అందుకే అన్నీ వదులుకున్నానని చెబుతోంది. పోలీస్ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుందని, తనకు పోలీస్ డ్రెస్ వేసుకోవడమంటే ఇష్టం అని చెబుతోంది. పోలీసుగా పనిచేయడం గర్వంగా, గౌరవంగా ఫీల్ అవుతానంటూ చెప్పుకొస్తుంది.
ఇన్‌స్టాలో 4 లక్షల మంది ఫాలోవర్లు
పోలీస్ ఉద్యోగం మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదలిపెట్టుకోనంటూ ఈ అందాల బ్యూటీ చెబుతోంది. ప్రస్తుతం ఈ అందమైన లేడీ పోలీస్ ఆఫీసర్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల ఇన్‌స్టాఫెస్ట్ అవార్డులలో బెస్ట్ పోలీస్ ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మెడిలిన్ ప్రాంతాల్లో డయానా పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తోంది.
Viral Video:
రోజుకు 14 గంటల పాటు ఆమె డ్యూటీలో ఉంటూ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉంటుంది. ఆమెకు సంబంధించి తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆమె విన్యాసాలు చూడవచ్చు. ఆమె చేసే విన్యాసాలకు సంబంధించి వీడియో సోషల్ మీడియాగా తెగ హల్ చల్ చేస్తోంది. అందమే కాదు,.. ఈమెకు ధైర్యం కూడా ఎక్కువే అంటూ కొంతమంది కామెంట్ చేస్తోన్నారు. ఈ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ను చాలామంది స్పూర్తిగా తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె గురించి చర్చ జరుగుతోంది.
https://www.youtube.com/shorts/LJslBPKUqUo