Vastu Tips: చాలామంది ఇళ్లల్లో ఎక్కడపడితే అక్కడ కూర్చోని భోజనం చేస్తూ ఉంటారు. ఎలా పడితే అలా.. ఎక్కడ పడితే అక్కడ భోజనం చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. ఎక్కడ తింటే ఏమవుతుంది అంటూ పట్టించుకోరు. టీవీ చూస్తూ, బెడ్ రూంలో మంచం మీద.. ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చోని తింటూ ఉంటారు. కానీ భోజనం ఎక్కడ చేయాలి.. ఏ దిశలో కూర్చోని తినాలి అనే విషయాలు కూడా వాస్తు శాస్త్రంలో ఉన్నాయి.
డైనింగ్ హల్ పశ్చిమాన ఉంటే మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. లేకపోతే ఈశాన్య లేదా తూర్పు దిశలో డైనింగ్ హల్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక దక్షిణ దిశలో ఉన్న ఆహారాన్ని తినకూడదని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. దక్షిణ దిశను యమరాజు దిశగా చెబుతారని, అటువైపుకు ఎదురుగా భోజనం చేయకూడదని వాస్తు పండితులు అంటున్నారు. దక్షిణ దిశలోని అహారం తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారని చెబుతున్నారు.
ఇక తూర్పు లేదా ఈశాన్య దిశలో ఆహారం తీసుకోవడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆ దిశల్లో ఫుడ్ తినడం ద్వారా మంచి శక్తి వస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. పశ్చిమ దిశలో కూడా కూర్చోని ఆహారం తినడం మంచిదని అంటున్నారు. ఈ దిశలో కూర్చోని తినడం వల్ల మీ వృత్తిలో, వ్యాపారాల్లో లాభాలు పడుతారని చెబుతున్నారు. ఇక ఉత్తరాభిముఖంగా కూర్చోని ఫుడ్ తినడం వల్ల విద్యార్థులకు మంచి జరుగుతుందని వాస్తు పండితులు అంటున్నారు.
Vastu Tips:
ఆహారం తీసుకునేటప్పుడు వీటన్నింటినీ పాటించడం వల్ల మంచి జరుగుతుందని, పాటించకుండా ఎక్కడ బడితే అక్కడ కూర్చోని తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశముందని వాస్తు పండితులు చెబుతున్నారు. జీవితంలో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అంటున్నారు.