Vijay Devarakonda: రౌడీ బాయ్.. అర్జున్ రెడ్డి ఫేమ్.. విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, అంతకు ముందు అర్జున్ రెడ్డి మూవీతో ఆలిండియా లెవల్ లో విజయ్ దేవరకొండ పేరు మార్మోగింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ.. కేవలం 5 కోట్ల రూపాయలతో తెరకెక్కింది. 2017లో ఏకంగా 50 కోట్ల వరకు వసూలు చేసింది.
అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. సాధారణ యువకుడిగా ఉన్న విజయ్ లైఫ్ స్టైల్ ను ఏకంగా సెలబ్రిటీ స్థాయికి చేర్చింది అర్జున్ రెడ్డి మూవీ. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ గా మూవీలు చేయడం ఒక్కటే మిగిలిందన్న తీరులో విజయ్ దేవరకొండ వెలిగిపోయాడు. బాలీవుడ్ స్టార్లతోనూ పరిచయం పెంచుకుని వారితో పాన్ ఇండియా రేంజ్ వాణిజ్య ప్రకటనల్లో నటించాడు.
అర్జున్ రెడ్డి తర్వాత కమిట్ మెంట్ మూవీలు ఉండడంతో ఇక్కడే చేయక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి విజయ్ దేవరకొండకు. అయితే, ఈలోగా వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ లతో భారీ డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు విజయ్. ఇవి మర్చిపోయేలోగా లైగర్ ఏకంగా మర్చిపోలేని స్థాయిలో బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో విజయ్ ఊహించిన బాలీవుడ్ రేంజ్ కాస్తా అధ:పాతాళానికి చేరినట్లు అయ్యింది. అయితే, భారీ బ్లాక్ బస్టర్ మూవీ వస్తే ఆకాశానికి ఎత్తేయడం, డిజాస్టర్లు వచ్చినప్పుడు అంతే స్థాయిలో ట్రోలింగ్ చేయడం టాలీవుడ్ లో అయినా, బాలీవుడ్ లో అయిన కామనే.
Vijay Devarakonda: కరణ్ అప్రోచ్ అయ్యారా?
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండపై రోజుకో కథనం వెలువడుతోంది. సిల్లీ వార్తలు పుట్టుకొస్తున్నాయి. సమంత అనారోగ్యంతో ఖుషీ మూవీ షూటింగ్ ఆగిపోయింది. లైగర్ డిజాస్టర్ తో జనగణమనను పక్కనపెట్టేశారు. తాజాగా విజయ్ దేవరకొండను బ్రహ్మాస్త్ర 2 కోసం అడుగుతున్నారనే క్రేజీ వార్తలు వెలువడుతున్నాయి. రణ్ బీర్ కపూర్ నటించిన శివ పాత్రకు తండ్రి గా పాత్ర దేవ్. ఈ పాత్ర కోసం పలువురు బాలీవుడ్ నటులని సంప్రదించిన కరణ్ జోహార్.. చివరికి విజయ్ దేవరకొండని సంప్రదించాడంటూ సిల్లీ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తలు విజయ్ ఫ్యాన్స్ ను మరింత కోపానికి గురి చేస్తున్నాయి.