యాంకర్ గా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ అనసూయ. ఈ అమ్మడు తన హాట్ హాట్ ఫొటోలతో గ్లామర్ యాంకర్ గా మంచి ఫేమ్ సొంతం చేసుకొని తరువాత నటిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఇక రంగస్థలం సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపొయింది. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ అనసూయ వస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు, ఐదు సినిమాల వరకు ఉన్నాయి. అందులో పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ఉండటం విశేషం. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళీ బాషలలో కూడా ఈ బ్యూటీ అడుగుపెడుతుంది.
అలాగే కన్నడ ప్రేక్షకులని కూడా అలరించడానికి రెడీ అవుతుంది. ఇక ఈ బ్యూటీ సినిమాలతో ఎంత పాపులారిటీ సొంతం చేసుకుందో అదే స్థాయిలో సోషల్ మీడియాలో వివాదాలతో పాపులర్ అయ్యింది. అనసూయని సోషల్ మీడియాలో ఎవరైనా ఆంటీ అని పిలిస్తే అస్సలు ఒప్పుకోదు. ఈ నేపధ్యంలోనే చాలా సార్లు సోషల్ మీడియాలో నెటిజన్స్ తో ఆమె గొడవలు కూడా పడింది. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా విజయ్ దేవరకొండతో అనసూయకి అంతగా పడదని టాక్ ఉంది.
ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలతో అనసూయ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఇక తాజాగా మాయా పేటిక అనే సినిమా ఫంక్షన్ లో అనసూయ పాల్గొంది. అక్కడ మాట్లాడుతూ తాను ఎవరినైన అన్నయ్య అంటే తట్టుకోలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో థాంక్యూ బ్రదర్ అనే సినిమా చేసిన బ్యానర్ లోనే మాయా పేటిక మూవీ తెరకెక్కింది. ఈ నేపధ్యంలో ఆ సినిమా ఫంక్షన్ ని అనసూయ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.