Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం ‘యశోద’. నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందకొచ్చిన ఈ సినిమాకు.. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఈ మూవీలో ట్విస్టులు బాగున్నాయని.. సమంత తన పాత్రకు న్యాయం చేసిందని ఆడియెన్స్ అంటున్నారు. విమర్శకులు కూడా సామ్ యాక్టింగ్‌ను మెచ్చుకుంటున్నారు. దీంతో ఆమె ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు.
ఇకపోతే, ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ‘యశోద’ మూవీ ప్రమోషన్స్‌లో సమంత పాల్గొన్నారు. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమాలపై ఆమె నిబద్ధత చూసి ఫిదా అవుతున్నారు. ఈ విషయాన్ని అటుంచితే.. ప్రమోషన్స్ టైమ్‌లో సమంత చేతికి ధరించిన ఉంగరాళ్లపై అందరి దృష్టి పడింది.
తొలిసారి ఉంగరాలతో కనిపించిన సామ్
ఎప్పుడూ డిజైనర్ వేర్ జ్యువెలరీలో కనిపించే సామ్.. తొలిసారిగా ఇలా జాతకాల ప్రకారం రంగురాళ్లను ధరించడం ఆసక్తికరంగా మారింది. గత కొన్నాళ్లుగా తన జీవితంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా సమంత ఈ మధ్య కాలంలో జాతకాలను కూడా నమ్ముతున్నారని తెలుస్తోంది. అందుకే ఆమె చేతికి రంగురాళ్లను ధరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Samantha: సత్ఫలితాలను ఇస్తాయా..?
సమంత తన చేతికి పెట్టుకున్న రంగురాళ్లలో ఒకటి కనకపుష్యరాగం. ఇది సంపద, ఆరోగ్యానికి శుభసూచకంగా భావిస్తారట. దీంతో పాటు ఆమె గోమేధకం అనే మరో ఉంగరాన్ని కూడా ధరించారు. ఇది చెడు దృష్టి నుంచి కాపాడుతుందని నమ్ముతారు. దీన్ని ధరించిన వారికి శారీరకంగా, మానసికంగా మంచి ఫలితాలు వస్తాయని అంటుంటారు. మరి, ఈ రంగురాళ్లతోనైనా సామ్ ఆరోగ్యం మెరుగుపడుతుందేమో చూడాలి.