Kriti Sanon : బాలీవుడ్ నటి కృతి సనన్, వరుణ్ ధావన్ తమ అప్ కమింగ్ మూవీ భేడియా ప్రమోషన్స్‌ను ఇప్పటికే మొదలుపెట్టేశారు. బిజీ షెడ్యూల్ నడుమ ఈ ఇద్దరు స్టార్స్ మెట్రో సిటీల్లో పర్యటిస్తూ మూవీ ప్రమోషన్స్ చేపడుతూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. తమ మూవీ ప్రమోషన్‌తో పాటే పనిలో పనిగా లేటెస్ట్ ఫ్యాషన్ స్టైల్స్‌ను ఫ్యాషన్ లవర్స్‌కు అందిస్తున్నారు. తాజాగా ఈ జంట ముంబైలో ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరై అందరి దృష్టిని ఆకర్షించింది. మరీ ముఖ్యంగా కృతి లుక్ కుర్రాళ్లను ఫిదా చేసేసింది. ఈ ప్రమోషనల్ ఈవెంట్ కోసం కృతి నియాన్ గ్రీన్ కలర్ మినీ లెన్త్ కటౌట్ గౌన్‌ను ధరిం చింది. కృతి ఈ అవుట్‌ఫిట్‌లో హాట్ ఫోటో షూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్‌ను పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో కృతి హాట్ లుక్స్‌కు అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఈ కటౌట్ బాడీకాన్ డ్రెస్‌లో కృతి సరికొత్తగా కనిపించి ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేసింది. ఫ్యాషన్ స్టైలిస్ట్ సుకృతీ గ్రోవర్ కృతికి స్టైలిష్ లుక్స్‌ను అందించింది. అంతే కాదు సుకృతి ఈ ప్రమోషనల్ లుక్‌కు సంబంధించినన పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సెలబ్రిటీ ఫేవరేట్ డిజైనర్ క్లాతింగ్ లేబుల్ డేవిడ్ కోమా షెల్ఫ్ నుంచి ఈ నియాన్ బాడీకాన్ డ్రెస్‌ను ఎంపిక చేసుకుంది కృతి సనన్.

బాలీవుట్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, అనన్య పాండే, జాన్వీ కపూర్‌లు ఈ బ్రాండ్ దుస్తులను వేసుకునేందుకు ఇష్టపడుతుంటారు.కృతి కూడా ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. ఫుల్ స్లీవ్స్, రౌండ్ నెక్ లైన్, కటౌట్ డీటైల్స్, ప్లీట్స్‌తో ఫిగర్ హగ్గింగ్ ఫిటింగ్ తో వచ్చిన ఈ మినీ అవుట్‌ఫిట్‌లో తన అందాలను స్పష్టంగా చూపిస్తోంది ఈ చిన్నది.

ఈ మినీ డ్రెస్‌కు కాంట్రాస్ట్‌గా మోకాళ్ల వరకు వచ్చే లా బ్లాక్ కలర్ హీల్డ్ లెదర్ బూట్స్ వేసుకుని అదరగొట్టింది. చేతి వేళ్లకు ఉంగరాలు, చెవులకు హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని తన లుక్‌ను పూర్తి చేసి ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. కనులకు వింగెడ్ ఐలైననర్, మస్కరా, సబ్టిల్ ఐ ష్యాడో వేసుకుంది. పెదాలకు మావీ లిప్ షేడ్ దిద్దుకుని గ్లామరస్ లుక్స్‌తో అందరిని మెస్మరైజ్ చేసింది.

కృతి సనన్ పబ్లిక్ గా ఎప్పుడు కనిపించినా అందరి చూపులను తనవైపుకు తిప్పుకోవడంలో ముందుంటుంది. ఈ మధ్యనే మూవీ ప్రమోషన్ కోసం అందమైన చీరకట్టుతో కుర్రాళ్ల మదిని దోచసింది ఈ బ్యూటీ. రణ్‌బీర్ ముఖర్జీ డిజైనర్ లేబుల్ నుంచి ఎన్నుకున్న మల్టీకలర్ చీరను సాంప్రదాయబద్ధంగా కట్టుకుని ఎత్నిక్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేసింది.

ఈ చీరకు జోడీగా బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో డిజైన్ చేసిన ట్యూబ్ బ్లౌజ్‌ను వేసుకుని అదరగొట్టింది. తన కురులతో మెస్సీ పోనీటెయిల్ వేసుకుని, మినిమల్ మేకప్‌తో తన చీరకట్టుతో మంత్రముగ్ధులను చేసింది ఈ బ్యూటీ.
