Pragya jaiswal: చిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ తెచ్చుకోవాలంటే అందం, అభినయం ఉంటే సరిపోదు. కాస్తంత అదృష్టం కూడా వాటికి తోడవ్వాలి. అందంగా ఉన్న వాళ్లందరూ ఇక్కడ రాణిస్తారనడానికి లేదు. అందంగా లేకపోతే స్టార్లు కాలేరనీ చెప్పలేం. అందాన్ని, ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూనే కథల ఎంపికలోనూ జాగ్రత్త వహించాలి. ఇక లక్ అనేది ఎవ్వరి చేతిలోనూ లేదు. అయితే కష్టపడే వారినే విజయం వరిస్తుందంటారు కాబట్టి నిరంతరం శ్రమించాల్సిందే. అందునా తీవ్రమైన పోటీ ఉండే సినీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలంటే కష్టాన్ని ఇష్టంగా చేసుకుని ముందుకెళ్లాలి.
అందం, అభినయం ఉన్నా స్టార్ స్టేటస్ అందుకులేకపోయిన వారిలో ఉత్తరాది భామ ప్రగ్యా జైస్వాల్ ఒకరు. తెలుగులో ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఈ క్యూటీ బ్యూటీ.. పెద్దగా విజయాలను అందుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ తన అందచందాలతో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అనూహ్యంగా పెంచుకుంటున్నారు. హాట్ ఫొటోలు, క్లీవేజ్ అందాలతో ఆమె రచ్చ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రగ్యా వదిలిన ఓ హాట్ వీడియో వైరల్ అవుతోంది.
మోడలింగ్ నుంచి సినిమాల్లోకి..
ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు ప్రగ్యా జైస్వాల్ మోడల్‌గా సత్తా చాటారు. ఈ క్రమంలోనే ‘విరట్టు’ అనే తమిళ మూవీతో హీరోయిన్‌గా కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఈ చిత్రం తెలుగులో ‘డేగ’ పేరుతో రిలీజైంది. ఆ తర్వాత అభిజీత్ నటించిన ‘మిర్చి లాంటి కుర్రాడు’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
Pragya jaiswal: ‘అఖండ’ సక్సెస్‌తో రిలీఫ్
ఫస్ట్ సినిమాతో తెలుగులో పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయిన ప్రగ్యా.. రెండో చిత్రం ‘కంచె’తో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. దీంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. అనంతరం ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘ఆచారి అమెరికా యాత్ర’ లాంటి మూవీల్లో ప్రగ్యా నటించారు. వీటిల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. భారీ సక్సెస్ లేక సతమతమవుతున్న ప్రగ్యాకు ‘అఖండ’ చిత్రం బిగ్ రిలీఫ్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జాతర చేసింది.