సౌర్య దొరకాలని కోరుకుంటూ గుడిని శుభ్రం చేస్తుంటుంది దీప. అది చూసిన మోనితకి వంటలక్క దేని కోసం అలా చేస్తోందని అనుమానపడుతుంది. అనంతరం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న దీపకి కార్తీక్ డబ్బులు ఇస్తాడు. అది చూసి మోనిత కోపంతో ఊగిపోతూ వారిద్దిరినీ నానా మాటలు అంటుంది. దాంతో మోనిత చెంప పగులగొడతాడు కార్తీక్. ఆ తర్వాత నవంబర్ 11న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
మోనితని తిట్టి దీపకి డబ్బులు ఇప్పిస్తాడు కార్తీక్. అనంతరం ఇంటికి వెళుతూ కార్తీక్‌కి గతం గుర్తొచ్చిందా లేదా అని డౌట్ పడుతుంది మోనిత. అక్కడికి వెళ్లిన మోనితకి తనకోసమే ఎదురు చూస్తున్న ఆనందరావు కనిపిస్తాడు. అతన్ని చూసి కంగారు పడుతుంది మోనిత. ఆనంద్‌ని తనతో తీసుకెళతానని అంటాడు ఆనందరావు. అది విని.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో పడిపోతుంది మోనిత. కానీ వెంటనే తీసుకెళ్లమని చెప్పి.. దీప, కార్తీక్, దుర్గ కంట వారు పడకుండా చూడాలని కంగారు పడుతుంది. అందుకే దీప దగ్గరకి వెళితే ఇంటికి వెళ్లిపోయాడని చెబుతుంది. దాంతో.. వెనుకే పరుగెత్తుకుంటూ వెళ్లి ఇంట్లోకి వెళుతున్న కార్తీక్‌కి ఫోన్ చేసి.. శివకి యాక్సిడెంట్ అయ్యిందని చెబుతుంది. దాంతో.. కంగారుగా కారు దగ్గరకి వచ్చి బయలుదేరబోతుంటారు కార్తీక్, మోనిత. ఇంతలో శివ అక్కడికి వస్తాడు. అది చూసి కార్తీక్ షాకవుతాడు. మోనిత కంగారు పడుతుంది.
దాంతో.. ఎవరో ఓ వ్యక్తి కాల్ చేసి చెప్పాడని అబద్ధం చెబుతుంది మోనిత. దాంతో.. తనని బయటికి పంపడానికే ఇలాంటి నాటకాలు అడుతున్నావని మోనితని తిడతాడు కార్తీక్. అంతేకాకుండా.. ఇంట్లో ఎవరు ఉన్నారంటూ అక్కడికి వెళతాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. అది చూసిన మోనిత కొంచెం రిలాక్స్ అవుతుంది. దానికి ముందు.. మోనిత దగ్గర పని చేసే శివలత కావాలనే ఆనందరావుని, హిమని పంపించేస్తుంది. అనంతరం ఆనంద్ గురించి ఆరా తీస్తాడు కార్తీక్. దాంతో తనని తిట్టడం మానేయమని చిరాకుగా అంటుంది మోనిత. అది విని తర్వాత అన్ని నిజాలు బయట పడతాయని అంటాడు కార్తీక్. అనంతరం ఎందుకు త్వరగా వచ్చావురా అంటూ శివ చెంప పగులగొట్టి ఇంట్లోకి వెళ్లిపోతుంది మోనిత.
మరోవైపు.. ఆనంద్‌తో కలిసి కారులో వెళుతున్న హిమ చాలా సంతోష పడుతుంది. అది చూసి ఇకపై బుద్దిగా చదువుకోవాలని చెబుతాడు ఆనందరావు. సౌర్యని ఎలాగైనా తీసుకొస్తామని మాటిస్తాడు ఆనందరావు. అనంతరం శివలత మాటలని బట్టి బాబుని మోనిత బాగా చూసుకోట్లేదని అనుకుంటారు హిమ, ఆనందరావు.
ఆ రోజు రాత్రి.. పెద్ద గండం తప్పిందని ఆనందపడుతుంటుంది మోనిత. అనంతరం శివలతని పిలిచి.. ఆనందరావుకి ఏం డౌట్ రాలేదా అని అడుగుతుంది మోనిత. అనంతరం కార్తీక్, ఆనందరావు తండ్రికొడుకులు అని అర్థమైనట్లు చెబుతుంది శివలత. అలాగే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పనని అంటుంది శివలత. దాంతో.. కొంచెం రిలాక్స్ అయిన మోనిత.. శివలత మీద ఓ కన్నేసి ఉంచాలని అనుకుంటుంది. ఇంకోవైపు.. ఇంద్రుడు, చంద్రమ్మ ప్రవర్తన గురించే ఆలోచిస్తూ ఉంటుంది సౌర్య. ఇంతలో వచ్చిన చంద్రమ్మ, ఇంద్రుడు కిరాణా షాపు స్టార్ట్ చేస్తున్నామని సంతోషంగా చెబుతారు. అది పట్టించుకోని సౌర్య.. వారిలో మార్పు వచ్చిందని బాబాయ్, పిన్నిని తిడుతుంది. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడండి.