కార్తీక్, దీపకి సందేహం వచ్చిందని సౌర్యని తీసుకుని ఊరు మారిపోతారు ఇంద్రుడు, చంద్రమ్మ. అక్కడ అందరికీ సౌర్య తల్లిదండ్రులం తామే అని చెబుతుంటారు వాళ్లు. అలాగే.. సౌర్యకి కూడా అసలు తల్లిదండ్రుల గురించి చెప్పొద్దని చెబుతారు. మరోవైపు.. దీప మీద కార్తీక్ చూపే రెస్పెక్ట్ వల్ల.. అతనికి గతం గుర్తొచ్చిందేమోననే అనుమానం మోనితకి వస్తుంది. ఆ తర్వాత నవంబర్ 10న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఉదయమే దీప ఇంటి దగ్గరకి వెళతాడు కార్తీక్. కానీ.. ఇంటికి తాళం వేసి ఎక్కడికో తీసుకెళ్లిపోయి ఉంటుంది దీప. అది చూసి ఏమైందని ఆలోచిస్తుంటాడు కార్తీక్. దీప మాత్రం ఉదయమే గుడికి వెళ్లి.. గుడిని శుభ్రం చేసి అలంకరిస్తుంటుంది దీప. అది చూసిన పూజారి.. అంత మంచే జరుగుతుందని చెబుతాడు. దీపని ఫాలో అవుతూ వచ్చిన మోనిత.. దీపకి ఏం అంత కష్టం వచ్చందని ఇలా గుడిని క్లీన్ చేస్తుందని అనుకుంటుంది మోనిత. అనంతరం.. పూజారి దగ్గరకి వెళ్లి దీపకి ఏం కష్టమొచ్చిందని అడుగుతుంది మోనిత. అది విని.. పక్క వల్ల కష్టాలు తీర్చలేకపోతే.. తెలుసుకోకపోవడమే మంచిది కదా అని చెబుతాడు పూజారి. అది విని.. దాని కష్టమే నేను కదా అనుకుంటుంది మోనిత.
అనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించడం గురించి అడుగుతుంది మోనిత. దాంతో.. సంపద, సౌభాగ్యం బావుండాలని అలా చేస్తారని చెబుతాడు పూజారి. అది విని.. తను కూడా అలాగే చేస్తానని అనుకుంటుంది మోనిత. కార్తీక్‌ని తనకి దక్కేలా చేయమని కోరుకుంటుంది మోనిత. అక్కడ దీప గురించే టెన్షన్ పడుతుంటాడు కార్తీక్. ఇంతలో కొడుకు ఆనంద్ ఏడుస్తుండడంతో.. మోనిత ఎక్కడికి వెళ్లిందని అరుస్తుంటాడు కార్తీక్. ఇంతలో అక్కడికి వచ్చిన స్టాఫ్‌తో బాబుని ఎత్తుకోమని చెబుతాడు కార్తీక్. అప్పుడే అక్కడికి వచ్చిన మోనిత మీద అరుస్తాడు. దాంతో.. కార్తీక పౌర్ణమి పూజా చేస్తే అంతా సంతోషంగా ఉంటామని నవ్వుతూ చెబుతుంది మోనిత. అది విని.. మోనిత ఏదైనా ప్లాన్ చేస్తుందా అని అనుమానపడతాడు కార్తీక్. వెంటనే దీప గురించి అడిగితే.. గుడి ఊడిస్తోందని వెటకారంగా చెబుతంది మోనిత. మోనిత మాటలు విని ఇబ్బందిగా ఫీల్ అవుతాడు కార్తీక్. అది చూసి.. కార్తీక్ మీద మోనితకి అనుమానం ఇంకా ఎక్కువవుతుంది.
మరోవైపు.. సంగారెడ్డి వెళదామా అని ఇంద్రుడిని అడుగుతుంది సౌర్య. దాంతో.. ఫస్ట్ బస్సుకి వెళ్లి లాస్ట్ బస్సుకి వద్దామని అంటాడు ఇంద్రుడు. అది విని.. ఆటో ఏమైందని అడుగుతుంది సౌర్య. ఇంతలో అక్కడికి వచ్చిన చంద్రమ్మ.. బాబాయ్ నడుము నొప్పి రావడంతో డాక్టర్ సలహా మేరకు ఆటో అమ్మేశాడని చెబుతుంది. అది విని.. బాబాయ్, పిన్నిలో మార్పు వచ్చిందని అనుకుంటుంది సౌర్య. అక్కడ.. గుడి నుంచి వస్తుంది దీప. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్‌ని మొహమాటంగా రూ.600 కావాలని అడుగుతుంది దీప. అది విని.. ఫీలైన కార్తీక్ తన పర్సులోని డబ్బంతా ఇవ్వబోతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మోనిత ఆ డబ్బులాక్కుని.. వంటలక్క కోసమే చైన్ తాకట్టు పెట్టావా.. మీ ఇద్దరి మధ్య సంబంధం అంత దూరం వెళ్లిపోయిందా అని అంటుంది. అది విని కోపంతో ఊగిపోయిన కార్తీక్, మోనితని లాగిపెట్టి కొడతాడు. దాంతో.. కార్తీక్‌కి గతం గుర్తొచ్చిందని అనుకుంటుంది మోనిత. దీపకి కూడా అదే డౌట్ వచ్చి ఉంటుంది. ఇంతలో.. భర్త కోసం పూజా చేయడానికి సహాయం చేయడం తప్పు కాదు కదా అంటాడు కార్తీక్. చెంపలు వేసుకో అంటాడు కార్తీక్.
ఇంతలో అక్కడికి దుర్గ వచ్చి షూ చూపించి ఎలా ఉన్నాయని మోనితని అడుగుతాడు. షూ కొనుక్కోమని నువ్వే 10 వేలు ఇచ్చావు కదా అని అంటాడు దుర్గ. అది విని.. విలాసాల కోసం దుర్గకి డబ్బు ఇవ్వొచ్చు. కానీ పూజా కోసం నేను వంటలక్కకి డబ్బు ఇవ్వకూడదా అని అంటాడు కార్తీక్. దాంతో.. చేసేది లేక ఆ డబ్బుని దీపకి ఇస్తుంది మోనిత. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి ఎపిసోడ్‌లో చూడండి.