మాటల మాంత్రికుడి త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యి రెండు నెలల దగ్గర అవుతుంది. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేద్దామని అనుకునేసరికి మహేష్ బాబు తల్లి చనిపోవడంతో వాయిదా వేశారు. ఇక మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సినిమా టైటిల్ ఎనౌన్స్ చేస్తారని అందరూ భావించారు. అలాంటిది కూడా జరగలేదు. త్రివిక్రమ్ పుట్టినరోజు కూడా సినిమాకి సంబందించిన అప్డేట్ రాలేదు.
దీంతో ఎప్పుడు మళ్ళీ ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. రకరకాల రూమర్స్ వినిపించాయి. అయితే ఇక సెకండ్ షెడ్యూల్ ఈ నెలలోనే స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ భావించారు. ఇంతలో హీరోయిన్ పూజా హెగ్డేకి ఏదో ప్రమాదం కారణంగా కాలుకి గాయం అయ్యింది. డాక్టర్లు కనీసం ఒక నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో ఆమె ఇంటికే పరిమితం అయిపొయింది. సెకండ్ షెడ్యూల్ లో త్రివిక్రమ్ హీరో, హీరోయిన్స్ కాంబినేషన్స్ లో సీన్స్ ప్లాన్ చేసినట్లు టాక్.
పూజా హెగ్డే ఉంటేనే ఈ షెడ్యూల్ స్టార్ట్ చేయగలమని చెప్పి డిసెంబర్ మొదటి వారానికి వాయిదా వేసినట్లు తెలుస్తుంది. పూజా హెగ్డే కోలుకోగానే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని మాటల మాంత్రికుడు భావిస్తున్నాడు. ఇదిలా ఉంటే మరో వైపు రాజమౌళి మహేష్ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ చేసేసారు. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కనున్న సినిమా కాబట్టి పెర్ఫెక్ట్ గా సిద్ధం చేస్తున్నట్లు టాక్. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా లాంచింగ్ ఉండే విధంగా జక్కన్న, మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నారని బోగట్టా.