Pineapple: పైనాపిల్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పైనాపిల్ లో విటమిన్ ఏ, సీ, బీ6 తోపాటు కాల్షియం, ఐరన్, సోడియం, మాంగనీస్, పొటాషియం, రైబోఫ్లావిన్ వంటి మినరల్స్ కలిగి ఉంటాయి. వీటిని నేరుగా కట్ చేసుకొని చీలికలుగా తింటుంటారు. జ్యూస్ చేసుకొని కూడా తాగుతారు. పైనాపిల్ తీసుకోవడం వల్ల మనకు చాలా రకాలుగా ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా జీర్ణక్రియలో పైనాపిల్ కీలక పాత్ర పోషిస్తుంది.
పైనాపిల్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండటం వల్ల శరీరానికి విటమిన్లు, మినరల్స్ దక్కుతాయి. మనకు వాంతులు, వికారం లాంటి సమస్యలు ఎదురైనప్పడు కాస్త పైనాపిల్ జ్యూస్ తీసుకుంటే వెంటనే రిలీఫ్ ఇస్తుంది. జుట్టు రాలడం సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు పైనాపిల్ తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
పైనాపిల్ ను మామూలుగా తీసుకోరాదట. తినే ముందు ఉప్పు నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్‌ను తరచూ మనం తీసుకొనే ఆహారంలో భాగం చేసుకోవాలట. పైనాపిల్ ఫ్రూట్ కడుపు, మూత్రపిండాల వ్యవస్థలు సక్రమంగా పని చేసేలా చేస్తుందట. శరీరానికి శక్తి ఇవ్వడంతో పాటు తరచూ దాహం వేసే వారికి ఉపశమనం కలిగిస్తుంది.
Pineapple: పైనాపిల్ ను తినే ముందు ఇలా చేయాలి..
చాలా మంది పైనాపిల్ ను నేరుగా కట్ చేసుకొని తింటుంటారు. అయితే, తినే ముందు ఉప్పు నీటిలో నానబెట్టాలట. ఉప్పు బ్రోమెలైన్ ఎంజైమ్‌ను యాక్టీవ్‌గా లేకుండా చేస్తుందని చెబుతున్నారు. సాల్ట్ కలపడం వల్ల పైనాపిల్ పండు తీపిని, రుచిని మరింత పెంచుతుందంటున్నారు. పైనాపిల్‌ను ముక్కలుగా కోసి ఒక బౌల్‌లో వేసి దానిపై కొంత ఉప్పు చల్లుకోవాలి. ఓ నిమిషం అలా నీళ్లలో నానబెట్టి తర్వాత తినడం మంచిది.