రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎంతో నమ్మకంతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఊహించని విధంగా థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఏ ఎలిమెంట్ లో కూడా ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. కొద్దోగొప్పో హిందీలో డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. అది కూడా కరణ్ జోహార్ ప్రొడక్షన్ నుంచి సినిమా రిలీజ్ కావడం. ఇక రౌడీ విజయ్ కి నార్త్ ఇండియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది కూడా లైగర్ ఓపెనింగ్స్ బాగా రావడానికి కారణం అయ్యింది. అయితే రొటీన్ కథని ఎలాంటి ట్విస్ట్స్ లేకుండా చాలా సాదాసీదాగా తీసేసి భారీ హైప్ క్రియేట్ చేయడంతో పూరి జగన్నాథ్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక లైగర్ నష్టాల వలన దెబ్బతిన్న బయ్యర్లు ఇప్పటికి పూరి జగన్నాథ్ ని వెంటాడుతున్నారు.
ఇక విజయ్ దేవరకొండ అయితే లైగర్ మూడ్ నుంచి వీలైనంత వేగంగా బయటకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. సమంత అనారోగ్యం కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతుంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటాడు. ఈ నేపధ్యంలో లైగర్ సినిమా గురించి ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు.
లైగర్ సినిమా తనజీవితంలో చాలా పాఠాలు నేర్పిందని చెప్పాడు. ఇకపై స్టోరీ సెలక్షన్ విషయంలో నా ప్రాధాన్యత ఎలా ఉండాలి. నేను ఎలాంటి కథలకి సెట్ అవుతాను అనే విషయాన్ని లైగర్ సినిమా ఫ్లాప్ తో అర్ధమైంది అని చెప్పాడు. నెక్స్ట్ సినిమాల విషయంలో ఫ్యాన్స్ ని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే లైగర్ సినిమా ఫ్లాప్ అయిన కూడా విజయ్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. హిందీలో కరణ్ జోహార్ తో పాటు మరో అగ్ర నిర్మాత సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అలాగే తెలుగులో దిల్ రాజు, మైత్రీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ విజయ్ తో సినిమాలు చేసే వారి జాబితాలో ఉన్నారు.