Life Style: ప్రేమ,ఇష్క్,కాదల్ మీరు దానికి ఏ పేరు అయినా పెట్టండి అమ్మాయిలు,అబ్బాయిలు ఆ లోకంలో స్వేఛ్చగా విహరించాలని అనుకుంటారు. తమ పార్ట్ నర్స్ తమని స్పెషల్ గా చూసుకోవాలని ఎన్నో కలలు కంటుంటారు. అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇవ్వాలని,అక్కడికీ ఇక్కడికీ తిప్పాలని అనుకుంటారు. జామ్ అని బాయ్ ఫ్రెండ్స్ తో బండి మీద రైడ్స్ కి వెళ్ళడానికి ఉత్సుహత చూపుతారు.అయితే మగవారు కూడా దీనికి అతీతులు కారట.
మగవారు ఎలాంటి ఐ లవ్ యూ వినడానికి ఇష్టపడతారో చూద్దాం..
అబ్బాయిలు తమకి నచ్చిన అమ్మాయిలని ప్రేమలో దించడానికి ఎన్నో కష్టాలు పడతారు. కానీ అబ్బాయిలు కూడా తమ గర్ల్ ఫ్రెండ్ నుంచి ప్రేమని కోరుకుంటారట. బాయ్ ఫ్రెండ్స్ కానీ భర్తలు కానీ కేవలం ఐ లవ్ యూ అని వినడం మాత్రమే కాదు ఇంకా ఎక్కువ ఆశిస్తారట తమ భాగస్వాముల నుంచి. ఎంతో మందిని గమనించాక ఒక పెద్ద రిలేషన్ షిప్ కౌన్సిలర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ప్రేమని వ్యక్తపరచడం అంటే కేవలం ఐ లవ్ యూ అని చెప్పడం మాత్రమే కాదు అంటారు నిపుణులు. భాగస్వామితో క్లోజ్ గా ఉండాలి, అతగాడికి ఇష్టమైన విధంగా తయారవ్వాలి. అతనికి ఇష్టమైన వంట వండాలి,అతనికి ఇష్టమైన మాటలు మాట్లాడాలి. అతను పక్కన ఉన్నప్పుడు ఎలాంటి వ్యాపకాలు ఉండకూడదు. సెల్ ఫోన్స్ వచ్చాక సమస్యలు మరీ ఎక్కవ అయ్యాయి. అతను పక్కన ఉన్నప్పుడు సెల్ ఫోన్ లో దూరిపోకూడదు. అలా చేస్తే అతను మీకు ఇంపార్టెంట్ కాదు అనే భావన కలగవచ్చు.
Life Style:
కొన్ని వేల పదాలు చేయలేని పని ఒక కౌగిలింత చేయగలదు. అతనిని కౌగిలించుకోండి. ఇలా చేయడం వల్ల అతగాడు సంతోషంగా ఉండటం మాత్రమే కాదు,తమ భాగస్వామి తనని ఇష్టపడుతున్నారు అని తెలుకుకోగలరు.ముఖ్యమైన విషయాలలో అతని సలహాలు తీసుకోవడం కూడా మంచిదే.