Vastu Tips: డబ్బు సంపాదించాలని, సంపాదించిన దానిలో కొంత ఆదా చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. ప్రతి ఒక్కరికి డబ్బును ఆదా చేయాలనే ఉంటుంది. కానీ కొంతమంది ఎంత సంపాదించినా కానీ ఇంట్లో మాత్రం రూపాయి కూడా నిల్వకుండా ఉంటుంది. అసలు డబ్బు ఎలా ఖర్చయ్యాయో కూడా గుర్తించే పరిస్థితి కనిపించదు. అయితే దీని వెంట వాస్తు దోషం ఉండవచ్చు. వాస్తు దోషం ఉంటే ఇలా ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుంటే ఈ వాస్తు దోషాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. వెంటనే వాటిని సరి చేసి.. దోషాన్ని నివారించండి.
వాటర్ ట్యాంక్ విషయంలో జాగ్రత్త:
ఇంట్లో ప్రతి అవసరానికి నీళ్లు అవసరం. అందుకే ఇంటి నీటి అవసరాల కోసం వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇంటి పైకప్పు మీద ఉండే వాటర్ ట్యాంక్ స్థానం ఎంతో కీలకంగా. ఇంటి పైకప్పు మీద వాటర్ ట్యాంక్ ఆగ్నేయ దిశలో ఉంటే తీవ్ర నష్టం కలుగుతుందట. పేదరికం వస్తుందట. ఆర్థికంగా అనుకోని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందట. పైగా ఇంట్లో తరచూ గొడవలు,
కుటుంబ సభ్యుల మధ్య కలహాలు వస్తాయట.
వాస్తు ప్రకారం ఇంటిపైకప్పు మీద వాటర్ ట్యాంక్ ను నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లోకి సానుకూల శక్తిి వస్తుంది. ఒకవేళ నైరుతి దిశలో వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేసుకోవడానికి వీలు కుదరకపోతే దక్షిణ దిశలో ఏర్పాటు చేసుకోవచ్చని వాస్తు చెబుతోంది. అయితే స్లాబ్ కు, వాటర్ ట్యాంక్ కు మధ్య కనీసం 1,2 అడుగుల ఖాళీ స్థలం ఉండేలా జాగ్రత్తపడాలని వాస్తు వివరిస్తోంది.
టాయిలెట్ (మరుగుదొడ్డి) విషయంలో ఇది పాటించండి:
ఇంటి వాస్తులో మరుగుదొడ్డి అనేది ఎంతో కీలకం. అందుకే వాస్తు నిపుణులు మరుగుదొడ్డి విషయంలో మరింత శ్రద్ధ చూపిస్తుంటారు. టాయిలెట్ ని ఇంటి ఈశాన్య దిశలో నిర్మిస్తే తీవ్ర నష్టం కలుగుతుందని వాస్తు చెబుతోంది. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోక తప్పదు అని వాస్తు వివరిస్తోంది. ఇంటికి ఈశాన్యంలో మరుగుదొడ్డి ఉంటే ఎంత సంపాదించినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Vastu Tips: ఉత్తరం శుభ్రంగా ఉండేలా చూసుకోండి:
వాస్తు ప్రకారం ఇంటి ఉత్తరం దిశ ఎంతో శుభ్రంగా ఉండాలి. ఉత్తరం వైపు దుమ్ము, ధూళి చేరితే అది తీవ్ర నష్టానికి కారణమవుతుంది. ఇంటి ఉత్తర దిశ కుబేరుడు ఉండే స్థానం అని, అతి పరిశుభ్రంగా లేకపోతే డబ్బు నిలవదని వాస్తు చెబుతోంది. ఉత్తరం దిశలో ఎలాంటి చెత్తను వేయకూడదని, పాత సామాన్లకూడా వేయకూడదని వాస్తులో వివరించడం జరిగింది.