వేద బెస్ట్ మధర్ అవాలనే కోరికతో పిక్నిక్ వెళ్లేందుకు ఒప్పుకుంటుంది ఖుషి. అక్కడ మాళవిక ఆదిత్యకు అన్నీ నేర్పిస్తుంది. ఖుషితో క్లోజ్‌గా ఉండాలని చెప్తుంది. వేదని టార్గెట్ చేసిన మాళవిక దానికి ఆదిత్యని ఆయుధంగా వాడుకుంటుంది. అక్కడ యశోధర్ ప్రవర్తన ఇంట్లో వాళ్లకి నచ్చదు. ఆ తర్వాత నవంబర్ 8 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
కూతురికి జాగ్రత్తలు చెప్పి బాధపడుతూ ఖుషిని పిక్నిక్ పంపిస్తుంది వేద. అలాగే భర్తకు కావాల్సిన బ్యాగ్ కూడా సర్ది యశ్ చేతికి అందిస్తుంది. ఆ తర్వాత యశ్ కూతుర్ని తీసుకుని పిక్నిక్ వెళ్తాడు. అన్నయ్యతో బాగా ఎంజాయ్ చేయమని చెప్తుంది వేద. ఇంటి గడపదాకా వెళ్లిన ఖుషి అమ్మా అంటూ వెనక్కి వచ్చి ఐ మిస్ యూ అమ్మా అని వాటేసుకుంటుంది. ఆ తర్వాత వెళ్లడం ఇష్టం లేకపోయిన వెళ్తుంది.
ఆ తర్వాత సీన్‌లో మాళవిక ఆదిత్యతో కలిసి యశ్ ఖుషిల కోసం ఎదురుచూస్తుంది. అన్నయ్యా అంటూ ఆదిత్యతో మాట్లాడుతుంది కానీ మాళవికతో మాట్లడదు ఖుషి. కిటికీలో నుంచి చూస్తున్న వేదకు బాయ్ చెప్తూ వెళ్తుంది ఖుషి. వేదని రెచ్చగొట్టేందుకు మాళవిక కావాలని యశోధర్‌తో కారులో ముందే కూర్చుంటుంది. దాంతో వేద బాధపడుతుంది.
సీన్ కట్ చేస్తే.. చిత్ర వసంత్ కోసం ఎదురు చూస్తుంటుంది. వసంత్ వచ్చిన తర్వాత కోపంగా అరుస్తుంది. ఎందుకని అడగ్గా.. వేద చేసిన పని చెప్తూ తనకు బుద్ధి లేదంటూ అక్కని తిడుతుంది చిత్ర. వదినని తిట్టకూడదు. తనలాంటి వాళ్లు ఎవరూ ఉండరు అంటూ వదినని పొగడతాడు వసంత్.
ఖుషి నుంచి ఇంకా ఫోన్ రాలేదని ఎదురు చూస్తుంది వేద. యశోధర్‌ని తిట్టుకుంటుంది. అంతలోనే యశ్ ఫోన్ చేస్తాడు. ఖుషి ఏం చేస్తుందని అడగ్గా.. యశ్ పిలిచి అమ్మ ఫోన్ అంటూ ఇస్తాడు. ‘ఐ మిస్ యూ అమ్మ’ అంటూ మళ్లీ బాధపడుతుంది ఖుషి. బ్యాగ్‌లో స్నాక్స్ పెట్టాను. మీ డాడీకి కూడా పెట్టు. నువ్ కూడా తిను.. అని చెప్తుంది వేద. ఆ తర్వాత మీ డాడీతో ఒక సెల్ఫీ దిగి నాకు పంపు అంటుంది వేద. ఇదంతా చూస్తూ కుళ్లుకుంటుంది మాళవిక. వేద అంతు చూడాలనుకుంటుంది. ఆ తర్వాత కారు ముందు సీటులో కూర్చున్న ఖుషి మాళవికకు పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తుంది. దాంతో మాళవిక దిమ్మతిరుగుతుంది.
సీన్ కట్ చేస్తే.. యశ్ ఫ్యామిలీ పిక్నిక్ స్పాట్‌లో వాలిపోతారు. పిల్లలిద్దరూ కలిసి సరదాగా ఆడుకుంటారు. నీ వల్లే పిల్లలు అలా పెరగాల్సి వస్తుందని కోప్పడతాడు యశ్. ఆ తర్వాత ఆదికి వేద మీద కోపం పెరిగేలా రెచ్చగొడుతుంది మాళవిక. మరి చాటుగా ఆ మాటలు విన్న ఖుషి ఏం చేస్తుందో చూడాలి..