రుక్మిణి గురించి ఆదిత్యని ప్రశ్నిస్తుంది దేవుడమ్మ. కానీ ఆదిత్య అసలు నిజం చెప్పకపోవడంతో తనే తెలుసుకుంటానని అనుకుంటుంది మనసులో. ఆ తర్వాత దేవి దేవుడమ్మ దగ్గరికి వస్తుంది. మీరందరూ నా వాళ్లే అనుకుంటూ సంబరపడిపోతుంది. మాధవ్ తన తండ్రి కాదని అక్కడ చెప్పడంతో అందరూ కంగుతింటారు. ఆ తర్వాత నవంబర్ 7 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఆదిత్యను అస్తమానం కలవడం చూసేవాళ్లకి బాగుండదు కదమ్మా.. ఎవరైనా నిన్ను తప్పుగా అనుకుంటే నన్ను కూడా అన్నట్లే కదమ్మా.. నువ్ ఆ అబ్బాయితో చనువుగా ఉండడం మంచిది కాదు. ఆలోచించమ్మా.. నువ్ అర్థం చేసుకుంటావనే అనుకుంటున్నా.. అంటాడు రామ్మూర్తి రాధతో. అపుడు అసలు నిజం చెప్పకుంటే నాకే మంచిది కాదు. ఇన్ని రోజులు ఎట్ల చెప్పాలో తెలియలే. ఇపుడు సమయం వచ్చింది అంటుంది రాధ. ఆఫీసర్ సారుతో మాట్లాడడం తప్పు కాదు. ఆఫీసర్ సారు నా పెనిమిటి అని చెప్పేస్తుంది. దాంతో రామ్మూర్తి షాకవుతాడు. తాళి చూపించి ఆయనే నా పెనిమిటి. దేవమ్మకు తండ్రని అంటుంది. మిమ్మల్ని విడిచిపెట్టి పోలేక ఇక్కడే ఉండిపోయిన అంటుంది రాధ. అమ్మ చెప్పేది నిజమే తాతయ్య అంటుంది చిన్మయి వచ్చి. నాతో కూడా చెప్పింది. నానమ్మకు అలా జరగడం వల్ల ఆగిపోయింది అంటుంది. నా పేరు రాధ కాదు రుక్మిణి అని చెప్తుంది రాధ. ఈ పసిబిడ్డ కోసం వచ్చి.. ఈ పొద్దు విడిచిపెట్టి పోలేక పరేషాన్ అవుతున్నానంటుంది రాధ. జానకమ్మకు నయం అయిన తర్వాత బారాబర్ పోతానంటుంది. భర్త కళ్ల ముందు కనిపిస్తున్న మా కోసం ఆగిపోయిన నువ్ నిజంగా దేవతవమ్మా అని కొనియాడతాడు రామ్మూర్తి. ఇక నీ ఇష్టం తల్లి అని చేతులెత్తి దండం పెడతాడు.
సీన్ కట్ చేస్తే.. దేవి మాయమ్మని జల్దీ ఇక్కడికి తీసుకురావాలని అనుకుంటుంది మనసులో. దేవుడమ్మ వేడివేడిగా టిఫిన్ చేసి తినిపిస్తుంది మనవరాలికి. దేవి మాత్రం అది తన ఇల్లే అన్న ధైర్యంతో హుషారుగా మాట్లాడుతుంది. అది చూసి ఆదిత్య ఎమోషనల్ అవుతాడు. దేవి స్థానంలో రుక్కును ఊహించుకుంటాడు. ఆ తర్వాత మీ నాన్న కాదని చెప్పిన మాధవ్.. వెతకలేదా అని అడుగుతుంది దేవుడమ్మ. చెప్పకుంటేమాయెలే నాకు మంచి నాయన ఉన్నడని తెలిసిందని సంబరపడిపోతుంది దేవి. తండ్రి గురించి గొప్పగా చెప్పుకుంటుంది. నీకెవరు చెప్పారే అని అడిగినా కూడా నిజం చెప్పదు దేవి. కాకుంటే నిజం మాత్రం చెప్పలేకపోతున్నాని అంటుంది. నువ్వేమో మీ నాన్నని వెతుకుతున్నావ్.. నేనేమో నా కోడల్ని వెతుకుతున్నానంటుంది దేవుడమ్మ. నా కోడలంటే నాకు ఇష్టం కాదు ప్రాణమని చెబుతుంది. రుక్మిణి ఉన్న రోజులన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతుంది దేవుడమ్మ. ఎక్కడుందో తెలియదనుకుంటూ బాధపడుతుంది. తనతో పాటు ఇంట్లోని వారంతా రుక్మిణి గురించి గొప్పగా చెప్తారు దేవితో. కానీ సత్య మాత్రం ఆదిత్యని అపార్థం చేసుకుంటుంది.
నీకు మీ నాన్న దొరకాలి. నాకు నా కోడలి దొరకాలని కోరుకుంటుంది దేవుడమ్మ. మీ కోడలి ఫొటో ఉంటే ఇయ్యి అవ్వ. నేను కూడా వెతుకుతానంటుంది దేవి. సరేనని దేవుడమ్మ అంటుంది. కానీ ఆదిత్య మాత్రం కంగారు పడతాడు. ఆ తర్వాత దేవి నానమ్మతో బయటికి వెళ్తానంటుంది. కానీ ఆదిత్య మాత్రం వద్దని బలవంతం చేస్తాడు. నాతో రమ్మని దేవిని ఫోర్స్ చేస్తాడు. కానీ దేవి వినదు. దాంతో సరే పద అంటూ తీసుకెళ్తుంది దేవుడమ్మ. సారూ నువ్వేం పరేషాన్ కాకు అని ధైర్యం చెప్పి వెళ్తుంది దేవి.
ఆ తర్వాత దేవి మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తుంది సత్య. అదే నిజం అయితే దేవి ఎవరి బిడ్డా అన్న ఆలోచన వస్తుంది. వెంటనే మాధవ్‌కు ఫోన్ చేసి దేవి చెప్పిన మాటలన్నీ చెప్తుంది. దాంతో మాధవ్ నోట మాటరాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి.