Arjun-Vishawaksen : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, సీనియర్ హీరో అర్జున్‌ల మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. తాజాగా విశ్వక్‌సేన్‌పై అర్జున్.. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) ప్రెసిడెంట్ మంచు విష్ణుకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అర్జున్ సర్జా నిర్మాణ సారథ్యంలో ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా రూపొందుతున్న సినిమాలో తొలుత విశ్వక్‌సేన్‌ను హీరోగా అనుకున్నారు. దీనికి సంబంధించిన అన్ని వ్యవహారాలు పూర్తయ్యాయి. సినిమా పట్టాలెక్కింది కూడా అయితే షూటింగ్‌కి హాజరు కావాల్సిన విశ్వక్‌సేన్ కేవలం కొన్ని గంటల ముందు అర్జున్ టీంకు షాకిచ్చాడు.
షూటింగ్‌కి కేవలం కొన్ని గంటల ముందు ఈరోజు షూట్‌ని క్యాన్సిల్ చేయాలంటూ విశ్వక్ సేన్ మెసేజ్ పెట్టాడని ప్రెస్‌మీట్ పెట్టి మరీ అర్జున్ చెప్పిన విషయం తెలిసిందే. అతనికి కమిట్‌మెంట్ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. అతడిని సినిమా నుంచి కూడా తప్పిస్తున్నట్లు అర్జున్ స్పష్టం చేశాడు. ఆ తరువాత వేరొక హీరోతో ఆ సినిమాని తీయబోతున్నట్టుగా సైతం అర్జున్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై మరో టాక్ వినిపిస్తోంది. విశ్వక్‌సేన్‌పై అర్జున్ మా ప్రెసిడెంట్ మంచు విష్ణుకి ఫిర్యాదు చేశారని ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే అర్జున్ ఆరోపణలపై విశ్వక్ సేన్ కూడా ఇప్పటికే స్పందించాడు. సినిమాకు సంబంధించిన కథ, పాటలు ఇతర విషయాల్లో తనను పట్టించుకోకున్నా పర్వాలేదు కానీ కనీసం తాను ఇస్తున్న సూచనల్ని సైతం అర్జున్ పట్టించుకోవడం లేదని విశ్వక్‌సేన్ వాపోయాడు. ఈ విషయాలన్నింటినీ షూటింగ్‌కి ముందే ఒకసారి చర్చిద్దామనే క్యాన్సిల్ చేయాలని మెసేజ్ పెట్టినట్టు తెలిపాడు. తాను షూటింగ్ క్యాన్సిల్ చేయాలంటూ మెసేజ్ పెట్టినందుకు విశ్వక్‌సేన్ బహిరంగ క్షమాపణలను సైతం చెప్పాడు. కానీ అర్జున్ మాత్రం విశ్వక్‌సేన్ యాటిట్యూట్‌ను సహించలేకపోతున్నారు.