వేదకు భర్త మీద కోపం తగ్గి కూల్ అవుతుంది. ఖుషీతో పిక్నిక్ వెళ్లాలని సంబరపడిపోతుంది వేద. భర్తకు మరింత దగ్గరవడానికి అదే మంచి సమయం అనుకుంటుంది. అంతలోనే యశ్‌కు ఆదిత్య ఫోన్ చేస్తాడు. మనం నలుగురం కలిసి పిక్నిక్ వెళ్దాం అంటాడు. కొడుకు మాటకు కట్టుబడి ఉంటాడు యశ్. ఆ తర్వాత ఏం నవంబర్ 7 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
పిక్నిక్ వెళ్తున్నందుకు సంతోషంగా ఉంటుంది ఖుషి. అమ్మానాన్నలతో కలిసి గడపాలని కోరుకుంటుంది. అంతలోనే వేద వచ్చి ఖుషి మాటల్ని విని బాధపడుతుంది. నేను రావట్లేదని నీతో ఎలా చెప్పాలమ్మా అని మనసులో కుమిలిపోతుంది. కానీ తప్పక చివరకు విషయం చెప్తుంది. పిక్నిక్‌కి ఆది అన్నయ్య, మాళవిక కూడా వస్తున్నారని అంటుంది. మాళవిక ఎందుకు వస్తుంది? నాకు తను వద్దు.. నువే కావాలి అని వేదని వాటేసుకుంటుంది. కూతురికి కథలు చెప్పి.. ఈ పిక్న్‌కి నేను రాలేకపోతున్నానమ్మా.. నువ్ నాన్నతో వెళ్లి అన్నయ్యతో ఆడుకో అని ఖుషికి నచ్చచెప్తుంది. నాకు నీ తర్వాతే ఎవరైనా.. నేను నీతోనే ఉంటానని మారాం చేస్తుంది వేద. నీకు జ్వరంగా ఉంటే నేనెలా వెళ్తాను.. నీతోపాటే నేనుంటానని చెప్పి వెళ్లిపోతుంది.
సీన్ కట్ చేస్తే.. అభిమన్యుకి మాళవిక పిక్నిక్ వెళ్లున్న విషయం చెప్తుంది. చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ గెట్ టు గెధర్ అని చెప్పి వెళ్లిపోతుంది. అభి అడిగినా కూడా పిక్నిక్ స్పాట్ ఎక్కడో చెప్పదు మాళవిక. దాంతో అభి మాళవికని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఖుషి బుంగమూతి ఎందుకు పెట్టింది అని అడుగుతుంది మాళిని. వేద వచ్చి స్కూల్‌కు వెళ్తున్న ఖుషిని పొగడుతుంది. కానీ కోపంగా వెళ్లిపోతుంది పాప అక్కడినుంచి. కూతురి కోపం తగ్గేందుకు వేద విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. నేను బెస్ట్ మధర్‌ని కాదని వేద అనడంతో ఖుషి పరుగున వచ్చి తల్లి చెప్పిన మాటలు వింటుంది. అమ్మతో లేనపుడు కూడా నీ పద్ధతి ఎలా ఉందో చూస్తారని కథలు చెప్పి ఖుషిని పిక్నిక్ పంపించేందుకు ఒప్పిస్తుంది వేద. నువ్ బెస్ట్ మధర్ అవుతావంటే నేను నాన్నతో పిక్నిక్ వెళ్తానంటుంది ఖుషి. దాంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. యశ్ వేదకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటాడు కానీ వినిపించుకోదు.
ఆ తర్వాత సీన్‌లో ఆదిత్య పిక్నిక్ వెళ్తున్నందుకు హ్యాపీగా ఉందంటూ చెప్తాడు మాళవికతో. ఖుషి పిక్నిక్ వస్తుందా అని అనుమానిస్తాడు ఆది. తప్పకుండా వస్తుంది. ఖుషితో నువ్ చాలా దగ్గరవ్వాలని.. ఎంతలా అంటే పిక్నిక్ నుంచి తిరిగివచ్చేసరికి ఖుషి నీతోనే వస్తా అన్నయ్యా అనాలి.. అంతలా క్లోజ్ అవ్వాలని రెచ్చగొడుతుంది కొడుకుని. వేదకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని విర్రవీగుతుంది మనసులో.
యశోధర్ రెడీ అయి బయల్దేరుతుండగా ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అంటాడు రత్నం. అపుడే వేద కూతురికి జాగ్రత్తలు చెప్తూ తీసుకుని వస్తుంది. ఖుషిని వదిలి పెట్టి ఉండలేక కన్నీరు పెడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..