ఇంద్రుడి ప్రవర్తన చూసి కార్తీక్‌కి, చంద్రమ్మ ప్రవర్తన చూసి దీపకి అనుమానం వస్తుంది. సౌర్య వారి దగ్గరే ఉన్నప్పటికీ కావాలనే దాచేస్తున్నారని సందేహపడతారు. మరోవైపు.. మనవరాళ్లతో సరదాగా తిరిగొస్తానని చెప్పి హిమ, సౌర్యని తీసుకొని వెళతాడు ఆనందరావు. అది తెలిసి సౌర్య కోసం ఇంద్రుడు కూడా వెళతాడు. ఆ తర్వాత నవంబర్ 7న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఇంద్రుడి ఆటోని వెతకడానికి దీప, కార్తీక్ వెళతారు. అక్కడ కనిపించకపోవడంతో ఇంద్రుడి ఇంటికి వెళదామని అనుకుంటారు. ఇంకోవైపు.. సౌర్య రానంటున్న బలవంతంగా హైదరాబాద్ తీసుకెళుతుంటాడు ఆనందరావు. అమ్మనాన్న ఇక్కడే ఉన్నానని బాధగా అంటున్న వినకుండా కారులో తీసుకెళుతుంటాడు ఆనందరావు. వెనుకే ఆటోలో ఫాలో అవుతుంటాడు ఇంద్రుడు. ఇవి రెండు నడిచి వెళుతున్న కార్తీక్, దీప కంటపడతాయి. ఇంద్రుడిని చూసిన సౌర్య.. బాబాయ్ అని పిలుస్తుంది. ఆమె వాయిస్ విని గుర్తు పట్టేసిన దీప.. కారులో వెళుతుందని బాధగా చెబుతుంది దీప. ఆమె చెప్పడంతో కార్తీక్ వెనుకే పరిగెత్తిన అందుకోలేకపోతాడు. దాంతో.. మోనిత, ఇంద్రుడు కావాలనే నాటకాలు ఆడుతున్నారనుకుని.. అతని ఇంటికి వెళదామని చెబుతాడు కార్తీక్.
అనంతరం కారు వెనుకే వెళ్లిన ఇంద్రుడు.. వేగంగా వెళ్లి ఆటోని ఆనందరావు కారుకి అడ్డుగా పెడతాడు. వెంటనే కారు దిగి ఇంద్రుడి దగ్గరకి వెళ్లిపోతుంది సౌర్య. అది చూసి ఆనందరావు, హిమ ఎంత బ్రతిమాలిన రానంటుంది సౌర్య. అలాగే.. అమ్మనాన్న యాక్సిడెంట్ కారణం నువ్వేనని, వారు కనిపించే దాకా ఇంటికి రానని హిమపై కోపంగా అరుస్తుంది సౌర్య. మరో సారి అక్కడికి వస్తే కనిపించనంత దూరంగా వెళ్లిపోతానని బెదిరిస్తుంది సౌర్య. అనంతరం ఇంద్రుడితో కలిసి వెళ్లిపోతుంది. అది చూసి కన్నీరు పెట్టుకుంటుంది హిమ.
ఆటోలో వెళుతున్న సందర్భంగా.. నాన్నమ్మ వస్తే తనని బలవంతంగా తీసుకెళుతుందని చెబుతుంది సౌర్య. దాంతో.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని సంగారెడ్డికి వెళ్లిపోదామని అంటాడు ఇంద్రుడు. అతని మాటలు నమ్మిన సౌర్య సరేనంటుంది. ఇంకోవైపు.. ఇంటికి తాళం వేసున్న దీప ఇంటి దగ్గర ఎదురుచూస్తుంటుంది మోనిత. ఇంతలో అక్కడికి వచ్చిన దుర్గ.. కార్తీక్, దీప లేచిపోయారని చెబుతాడు. దానికి మొదట షాకైన మోనిత.. అందరు కలిసి ఏం ప్లాన్ చేశారని చెబుతాడు దుర్గ. అంతేకాకుండా.. కార్తీక్ గతం గుర్తొచ్చిందని అంటాడు దుర్గ. అందుకే ఇద్దరు కలిసి దూరంగా వెళ్లిపోయారని మోనిత మీద ఒట్టు వేస్తాడు దుర్గ. ఇంకోవైపు.. ఇంద్రుడి ఇంటికి వెళ్లిన తాళం వేసుండడం చూసి షాక్ అవుతుంది దీప. దాంతో.. పక్కింటి వాళ్లని అడిగితే ఇప్పుడే ఎక్కడికో వెళ్లారని, ఇప్పుడే తిరిగి వస్తారని చెబుతారు. అనంతరం అక్కడ ఉన్న ‘అమ్మనాన్న ఎక్కడున్నారు’ అనే పోస్టరు పడుండడం చూసి.. సౌర్య అక్కడే ఉందని అనుకుంటారు కార్తీక్, దీప. వాళ్లు రాగానే అటో ఇటో తేల్చుకుందామని అంటాడు కార్తీక్. సరేనని.. రేప్పొద్దునే వద్దామని అంటుంది దీప. దాంతో.. ఇద్దరు వెళ్లిపోతారు.
అక్కడ సౌర్య మాటలు గురించే ఆలోచిస్తుంటుంది హిమ. ఆనందరావు మాత్రం నా మనవరాలిని తీసుకెళ్లేంత ధైర్యం ఆ ఇంద్రుడికి ఎలా వచ్చిందని అనుకుంటాడు. దాంతో.. తన వల్లే అన్ని సమస్యలని బాధ పడుతుంది హిమ. మరోవైపు.. దుర్గ మాటల గురించే ఆలోచిస్తుంటుంది మోనిత. ఇన్ని రోజులు కష్టపడింది కార్తీక్‌ని, దీపకి అప్పగించడానికా అని కోపంగా అనుకుంటుంది మోనిత. ఇంతలో ఏదో చూసి సంతోషపడుతుంది మోనిత. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. ఇంద్రుడు చేస్తున్న మోసం కార్తీక్, దీప తెలుసుకున్నారో లేదో తర్వాతి ఎపిసోడ్‌లో చూడండి.