Bigg boss 6 : హౌస్‌లో ఉన్నన్ని రోజులు ఎవ్వరు చెప్పినా వినలే. నీకు డ్యామేజ్ అవుతుందని చెప్పినా తగ్గలే. నాది తప్పైతే నేనే పోతాలే అని చెప్పింది. ప్రతి దానిలోనూ లూప్స్ వెతుక్కోవడం. కనీసం గేమ్ పాజ్‌లో ఉన్నా కూడా తాను చేయాలనుకున్నది చేస్తూ పోయింది. అంతే.. జనాలు బయటకు పంపించేశారు. తన గొయ్యి తనే తవ్వుకుని వెళ్లేటప్పుడు మాత్రం ఓ రేంజ్‌లో కన్నీరు కురిపించేసింది. ఎంతలా అంటే బిగ్‌బాస్ హౌస్ ఆమె కన్నీటికి ఎక్కడ కొట్టుకుపోతుందో అన్నంతగా ఏడ్చింది.
తాను వెళ్లనని కెమెరాకు ముద్దు పెట్టి నానా గందరగోళం సృష్టించింది. చివరకు డోర్ క్లోజ్ చేయొద్దంటూ నానా రచ్చ చేసేసింది. మొదటిసారి సీజన్ 6లో ఇంతగా కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్ గీతూయే కావడం గమనార్హం. అక్కడితో ఆగిందా? వేదికపైకి వెళ్లిన తరువాత కూడా నాగార్జున ఎదుటే ఓ రేంజ్‌లో ఏడ్చింది. తాను పోనంటూ అక్కడ కూడా ఏడవడం కాస్త ఓవర్ అనిపించింది. ‘‘నేను ఇక్కడి నుంచి పోను. నేను పోను సార్.. నాకు ఉండాలనుంది. మిస్ యు ఆల్. ఐ లవ్ యు’’ అంటూ ఏడుస్తుంటే నాగ్ ఓదార్చారు. ఇక రేవంత్ పాట పాడేటప్పుడు వేదికపై గీతూ నట విశ్వరూపానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
అంతకు ముందు ‘ఏమైనా అయితే నేనే పోతాలే’ అని చెప్పిన గీతూయేనా ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అనిపించింది. ప్రతి గేమ్‌కి లూప్ వెతుక్కోవడం ఆమెకు ఒక పెద్ద మైనస్‌గా పరిణమించింది. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడే తీరు కూడా ఇబ్బందికరమే. ఇక నామినేషన్స్‌లో ఆమె వ్యవహార శైలి పీక్స్‌కి వెళ్లిపోతుంది. అలాగే బాలాదిత్య విషయంలో ఆమె ప్రవర్తన జనానికి ఏమాత్రం నచ్చలేదు. అను ఒక స్థాయికి వెళ్లిపోయి బతిమాలినా కూడా వినిపించుకోలేదు. ఇది బాగా డ్యామేజ్ అయిపోయింది. అలాగే సంచాలక్‌గా ఉంటూ గేమ్ ఆడటం. ఎవరు చెప్పినా వినకపోవడం వంటివి బాగా మైనస్ అయ్యాయి. గీతూ విషయంలో అంతా స్వయంకృతాపరాధమే. భస్మాసురిడిలా తన నెత్తిన తనే చేయి పెట్టుకుంది.