Director Anudeep: టాలీవుడ్ లో సినిమా హీరోలతో పాటు డైరెక్టర్లకు కూడా బాగా క్రేజ్ ఉంటుంది. కొంతమంది డైరెక్టర్లు అయితే తమకంటూ ప్రత్యేక స్టైల్ ని మెయింటెన్ చేస్తూ ఉంటారు. ‘జాతిరత్నాలు’ సినిమాతో అందరినీ నవ్వించిన డైరెక్టర్ అనుదీప్.. ఏ కార్యక్రామానికి వచ్చినా నవ్వులు పూయిస్తుంటాడు. అలాంటి దర్శకుడి జీవితంలో చోటుచేసుకున్న చీకటి కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది.
తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు డైరెక్టర్ అనుదీప్ వెల్లడించాడు. హైలీ సెన్సిటివ్ పర్సన్ (హెచ్ఎస్పీ) వ్యాధితో బాధపడుతున్నానని, తనకు గ్లూటెన్ అస్సలు పడదని అనుదీప్ వివరించాడు. తాను కాఫీ తాగితే రెండు రోజులపాటు నిద్ర పట్టదని.. ఏదైనా జ్యూస్ తాగితే తిరిగి తన మైండ్ కామ్ అవుతుందని అనుదీప్ పేర్కొన్నాడు.
హైలీ సెన్సిటివ్ పర్సన్ వ్యాధితో బాధపడుతున్న వారికి సెన్సెస్ బాగా పని చేస్తాయని అనుదీప్ తెలిపాడు. ఇలాంటి వారు ఎక్కువ లైటింగ్ చూసినా.. ఘాటైన వాసనలు పీల్చిన తట్టుకోలేరని.. త్వరగా అలిసి పోతారన్నారు. చాలామందిలో ఇలాంటి లక్షణాలు ఉన్నా కానీ ఎవరూ పట్టించుకోరని అనుదీప్ అన్నాడు. త్వరలోనే ఈ వ్యాధి మీద ఓ సినిమా చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు జాతిరత్నాలు డైరెక్టర్ తెలిపాడు.
Director Anudeep:
కాగా ఈ మధ్యనే హీరోయిన్ సమంత ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారికంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం తెలిసిందే. దీంతో తెలుగు ప్రేక్షకులను రంజింపజేస్తున్న వారు ఇలా అరుదైన వ్యాధులతో బాధపడుతుండటాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారంతా త్వరలోనే కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.