Pawan Kalyan: ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. విశాఖపట్నం వేదికగా వైసీపీ విజయ గర్జన ఏర్పాటు చేస్తే, అదే రోజు ఆ కార్యక్రమానికి పోటీగా జనసేనాని పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. దీంతో రాజకీయంగా ఉద్రిక్తత ఏర్పడింది. ఇరు పార్టీల నేతలు భారీగా విశాఖకు చేరుకోగా.. అనూహ్య పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ విశాఖ నుండి వెళ్లిపోయారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ నుండి తిరిగి వచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇల్లు, ఆఫీస్ చుట్టూ రెక్కీ చేస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంచలన ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని అనుమానాస్పదంగా రెక్కీ చేస్తున్నారని, పవన్ సెక్యూరిటీతో కూడా గొడవకు దిగినట్లు ఆయన ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దీనిపై పెద్ద దుమారమే రేగింది.
ఇదే విషయం మీద తెలంగాణ జనసేన అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కీలక ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మీద కీలక ప్రకటన చేస్తూ.. వినోద్, ఆదిత్య, సాయికృష్ణ అనే యవకులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
Pawan Kalyan:
అయితే వారంతా మద్యం మత్తులో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీతో గొడవ పడ్డారని పోలీసులు వివరించారు. అంతేకానీ వారు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ఎలాంటి రెక్కీ నిర్వహించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇదంతా తాగుబోతుల గలాటా తప్పితే రెక్కీ కాదని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. కాగా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ విషయంలో పలు అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో ఆయనకు జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ అందించాలనే డిమాండ్ వినిపిస్తోంది.