Allu Arjun: టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకొని, పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో.. అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన అల్లు అర్జున్.. తనదైన స్టైల్, డ్యాన్స్, నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకే కాదు, దేశంలోని పలు భాషల్లో అభిమానులను సొంతం చేసుకున్నాడు.
అల్లు అర్జున్ కేవలం తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడమే కాదు, ఇతర సినిమా హీరోల సినిమాలకు కూడా సాయంగా నిలుస్తుంటారు. అలా గతంలో విజయ్ దేవరకొండకు సాయంగా నిలవడం తెలిసిందే. అల్లు అర్జున్ ప్రమోట్ చేస్తున్నాడంటే ఆ సినిమాకు ఆటోమెటిక్ గా ఒక హైప్, క్రేజ్ వస్తాయి. చాలాసార్లు కొత్త వారికి కూడా అల్లు అర్జున్ సాయంగా నిలిచాడు.
అయితే తాజాగా అల్లు అర్జున్ తన సొంత తమ్ముడు అల్లు శిరీష్ కి మాత్రం సాయం చేయకపోవడం వార్తల్లో నిలుస్తోంది. అల్లు శిరీష్ గ్యాప్ తర్వాత చేసిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా చేయగా.. ఆ సినిమా విడుదలకు అంతా సిద్ధమైంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ తన తమ్ముడి సినిమాకు విషెస్ చెబుతూనో లేదంటే మరో రూపంలోనో సాయం చేస్తారనే టాక్ నడిచింది. కానీ బన్నీ మాత్రం సైలెంట్ గా ఉండిపోవడం ఇండస్ట్రీలో టాక్ గా మారింది.
Allu Arjun:
అల్లు అర్జున్ ఎందుకు తన తమ్ముడి సినిమా విషయంలో సైలెంట్ గా ఎవరికీ కనిపించకుండా, ఎలాంటి ట్వీట్ కానీ, ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేయలేదనే చర్చ సాగుతోంది. అయితే అల్లు శిరీష్ చేసిన కొత్త సినిమాలో కాస్త కిస్ డోజ్ ఎక్కువుందని, ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బందిపడే సీన్లు ఎక్కువగా ఉన్నాయని.. ఇలాంటి సినిమా విషయంలో అల్లు అర్జున్ ప్రమోట్ చేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారని బన్నీ అన్నింటికి దూరంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.