ఆదిత్యే తన తండ్రన్న విషయం దేవి చిన్మయికి చెప్పి సంబరపడిపోతుంది. సత్య ఆంటి అమ్మకు చెల్లెలు అని చిన్మయి కూడా తనకు తెలిసిన విషయం చెబుతుంది. అక్కడ కూతురు తన మీద చూపించిన ప్రేమకు ఆదిత్య పిచ్చివాడై పోతాడు. మరోవైపు సత్య ఎప్పటిలాగే భర్తని నిలదీస్తుంది. ఆ తర్వాత నవంబర్ 5 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఒంటరిగా కూర్చున్న ఆదిత్య దగ్గరికి వస్తుంది దేవుడమ్మ. రాను రాను నీ ప్రవర్తనలో వస్తున్న మార్పును చూస్తుంటే అనుమానం కలుగుతుంది. నువ్ అమ్మ, సత్యని వదిలి బయట బయటే తిరుగుతున్నావ్.. అంటే రుక్మిణి కలిసిందా? ఒకవేళ కలిస్తే మా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నిస్తుంది. ఛ.. ఛ రుక్మిణి నాకెలా కనిపిస్తుంది అంటూ తప్పించుకుంటాడు ఆదిత్య. మరి రుక్మిణి ఫొటో ఎందుకు పెట్టుకుని తిరుగుతున్నావంటూ నిలదీస్తుంది. తడబడుతూ లేదు.. లేదు అంటూ చెప్తాడు ఆదిత్య. నువ్ అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు. నా కోడలు ఎక్కడుందో నేను తెలుసుకోలేనా అని మనసులో అనుకుంటుంది దేవుడమ్మ.
సీన్ కట్ చేస్తే.. పెనిమిటికి దూరంగా ఉన్నందుకు రాధ బాధపడతుంది. అంతలోనే దేవి వస్తుంది అక్కడికి. ‘బిడ్డా పండుకో’ అని దేవమ్మతో అంటుంది రాధ. కానీ దేవి మాత్రం గుడిలో జరిగింది తలుచుకుని తల్లిని వాటేసుకుని సంబరపడుతుంది. రాధ నుదిటిన ముద్దు పెడుతుంది. దాంతో బిడ్డలో మార్పు వచ్చింది ఏమైందని ఆలోచిస్తుంది రాధ. అపుడే మాధవ్ గిటారు వాయిస్తాడు. ‘నాయనెవరు నాయనెవరు.. అని అడగను ఇక. నేనే తెలుసుకుంటా. అపుడు మనం ముగ్గురం కలిసి ఉందాం’ అంటుంది దేవి.
ఆ తర్వాత సీన్‌లో దేవి ఆఫీసర్ ఇంటికి వెళ్తుంది. తన ఇంటిని చూసుకుని మురిసిపోతుంది. ఇన్నిదినాలు వీళ్లందరూ నా వాళ్లని తెల్వకపాయె. నేను ఈ ఇంటి బిడ్డనని తెలవలేదు. దేవుడా.. మా అమ్మని, నాయన్ని నువ్వే కలపాలి అని కోరుకుంటుంది. కుడి కాలు ఇంట్లో పెట్టి ఎంట్రీ ఇస్తుంది. అపుడే దేవుడమ్మ రుక్మిణి గురించి తెలుసుకుంటానని చెబుతుంది రామ్మూర్తితో. అవ్వా అనుకుంటా వస్తుంది దేవి. మనవరాల్ని ముద్దాడుతుంది దేవుడమ్మ. ఆ తర్వాత ఇంట్లోనుంచి చెప్పకుండా ఎందుకెళ్లావని అడుగుతుంది. మా నాయన్ని వెతుక్కుంటా పోయిన అంటుంది దేవి. మాధవ్ ఇంటి దగ్గరే ఉన్నాడు కదా అంటాడు రామ్మూర్తి. లే గాయన మా నాయన కాదని బాంబ్ పేల్చుతుంది దేవి. దాంతో అందరూ కంగుతింటారు.
బాషా కూడా అడగ్గా.. మాధవ్ సారూ మా నాయన కాదు అందుకే వెతుక్కుంటా పోయిన అని చెప్తుంది దేవి. ఏంట్రా ఏం మాట్లాడుతుంది ఇది అని దేవుడమ్మ ఆదిత్యని అడగుతుంది. అందర్ని వరుసలతో పిలుచుకుంటుంది దేవి మనసులో. ఆ కథంతా విడిచిపెట్టి ఇంటికి మనవరాలు వచ్చింది కదా తినడానికి ఏమైనా పెట్టు అంటుంది దేవి. సరే టిఫిన్ రెడీ చేస్తానని వెళ్తుంది దేవి. సత్య ఆదిత్యని కోపంగా చూస్తుంది. ఆ తర్వాత సీన్‌లో రామ్మూర్తి ఆఫీసర్ బాబు గురించి నీ గురించి నాకు తెలుసు కానీ నువ్ అస్తమానం ఆ అబ్బాయిని కలవడం చూసే వాళ్లకు బాగుండదు కదమ్మ అంటాడు. మరి రాధ ఏం చేస్తుందో చూడాలి పాపం..