సౌర్య దొరకలేదని బాధ పడుతుంటుంది దీప. తన కూతురు కచ్చితంగా ఇంద్రుడి ఇంట్లోనే ఉండి ఉంటుందని అనుమానపడుతుంది. అదే విషయం చెబితే దుర్గ నిజం ఏంటో తెలుసుకోడానికి ఇంద్రుడి ఇంటికి బయలుదేరతాడు. అయితే.. అప్పటికే ఇంద్రుడితో కలిసి సౌర్యని దాచేసి మోనితనే నాటకం ఆడుతుండొచ్చని అనుమానపడుతుంటాడు కార్తీక్. దుర్గ బయలుదేరిన సమయంలోనే అక్కడికి వచ్చి తర్వాత తను, దీప కలిసి వెళతామని చెబుతాడు. ఆ తర్వాత నవంబర్ 5న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
హిమ రిక్వెస్ట్ చేయడంతో సౌర్యని తీసుకెళ్లడానికి ఇంద్రుడు ఉన్న ఇంటికి వస్తారు ఆనందారావు. వారు ఎంత రిక్వెస్ట్ చేసిన వారితో వెళ్లడానికి ఇష్టపడదు. అయినా ఆనందరావు బలవంత చేస్తుండడంతో వదిలేయమని రిక్వెస్ట్ చేస్తాడు ఇంద్రుడు. దాంతో.. ఇంద్రుడు, చంద్రమ్మ మీద అనుమానం ఉందని అరుస్తాడు ఆనందరావు. దాంతో.. వారు చాలా బాగా చూసుకుంటున్నారని వారికే సపోర్టుగా మాట్లాడుతుంది సౌర్య. ఇక చేసేది లేక సౌర్య తమతో వచ్చే వరకు అక్కడ ఉంటమని చెప్పి.. ఖర్చుల కోసం ఇంద్రుడికి డబ్బులు ఇస్తాడు ఆనందరావు.
ఇంకోవైపు.. సౌర్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది దీప. దుర్గ ఎన్ని సార్లు చెప్పిన అక్కడ సౌర్య ఉండే ఉంటుందని గట్టిగా అనుకుంటుంది దీప. ఇంతలో అక్కడికి వస్తుంది మోనిత. ఆ ఊర్లో ఆటో వాళ్లు తెలుసా అని అనుమానంగా అడుగుతుంది మోనిత. గతంలో వారణాసి అనే ఆటో వాడు ఉన్నట్లుగానే.. ఇప్పుడు కూడా ఇంకో ఆటో వాడైన ఉన్నాడా అని అడుగుతుంది మోనిత. దాంతో.. ఇంద్రుడు, మోనిత కలిసి ఏదైనా నాటకమాడుతున్నారా అని దీప అనుమానపడుతుంది. ఆటో డ్రైవర్ కోసం అడుగుతూ గొడవపడకుండా ఉన్నావని ప్రశ్నిస్తుంది దీప. దాంతో.. వాడిని నీకు సెట్ చేద్దామని అంటుంది మోనిత వెటకారంగా. దాంతో.. లాగిపెట్టి చెంప పగులగొడుతుంది దీప.
మరోవైపు.. సౌర్య గురించే ఆలోచిస్తుంటాడు కార్తీక్. ఇంద్రుడు, మోనిత కలిసి సౌర్యని దాచేస్తున్నారా అని అనుమానపడతాడు కార్తీక్. అవకాశం దొరికితే తన జీవితంలో సమస్యలు క్రియేట్ చేయడానికే చూస్తుంటుంది అనుకుంటాడు కార్తీక్. ఇంతలో.. అక్కడికి వచ్చిన మోనిత తనపై అనుమానపడుతున్నావా అని అడుగుతుంది. దానికి కొత్తగా అనుమానం రావడం ఏంటి.. ఎప్పుడు ఉంటుంది అంటాడు కార్తీక్. దాంతో.. తనేం తప్పు చేశానో చెప్పని అడుగుతుంది మోనిత. కార్తీక్ ఏదో చెప్పబోతుండగా.. దుర్గ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. తనకోసం హైదరాబాద్ ధమ్ బిర్యానీ తెచ్చానని అంటాడు దుర్గ. నేనెప్పుడు తెమ్మన్నానురా అని కోపంగా అడుగుతుంది మోనిత. దాన్ని పట్టించుకోకుండా.. ముగ్గురం కలిసి తిందాం రండి అంటాడు దుర్గ. దాంతో.. మోనితని తిట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. అనంతరం ఏం పాపం చేశానురా అని కోపంగా దుర్గని అడుగుతుంది మోనిత. దీపకి చేసిందాని కంటే చాలా చిన్నదని అంటాడు దుర్గ. తన ప్రేమని దూరం చేయలేవని ఆవేశంగా అంటుంది మోనిత. దాంతో.. నువ్వేం చేయలేవంటూ బిర్యానీ మోనిత దగ్గర పెట్టి వెళ్లిపోతాడు దుర్గ.
అనంతరం.. ఇంద్రుడు గురించి ఆరా తీయడానికి కార్తీక్, దీప వెళతారు. అతని ఇంటికి వెళదామని దీప అనగా.. అలా చేస్తే సౌర్యని ఎక్కడికైనా పంపించి, వారు కూడా కనిపించకుండా వెళ్లిపోయే ప్రమాదం ఉందని చెబుతాడు కార్తీక్. అనంతరం ఆటో డ్రైవర్ గురించి మోనిత అడిగిన విషయాన్ని చెబుతుంది దీప. దాంతో.. కార్తీక్కి మోనిత మీద అనుమానం ఇంకా బలపడుతుంది. తర్వాత సౌర్య గురించి జనాలను అడుగుతూ వెతుకుతుంటారు. మరోవైపు.. సౌర్యని వాళ్ల తాతతో పంపిందని చంద్రమ్మని లాగిపెట్టి కొడతాడు ఇంద్రుడు. అతను అటు నుంచి అటే వెళ్లిపోతే ఏం చేస్తావని కోపంగా అంటాడు ఇంద్రుడు. వాళ్ల మనవరాలిని పంపకుండా ఎలా ఉంటానని చెబుతుంది చంద్రమ్మ. సౌర్యని వాళ్లు తీసుకెళితే ఏం చేయలేమని చెప్పి వారిని వెతకడానికి ఆటోలో వెళతాడు ఇంద్రుడు. ఆటో స్టాండ్ దగ్గర ఇంద్రుడి గురించి ఆరా తీసిన కార్తీక్, దీప.. ఎవరు తెలియదని చెప్పడంతో నిరాశగా నడుస్తుంటారు. తర్వాత ఏం జరిగిందో నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడండి.