యశోధర్ మీద పీకల లోతు కోపంతో ఉంటుంది వేద. భార్యని కూల్ చేసేందుకు యశ్ విశ్వప్రయత్నాలు చేస్తాడు. మల్లెపూలు తీసుకొచ్చి వేద కోపం తగ్గించాలనుకుంటాడు. అపుడే ఖుషీ మనమందరం కలిసి పిక్నిక్ వెళ్దాం మమ్మీ అంటుంది. దానికి యశోధర్ కూడా ఒప్పుకోవడంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. అంతలోనే ఆదిత్య కూడా ఫోన్ చేసి పిక్నిక్ వెళ్దాం డాడీ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్‌లో చూద్దాం..
యశోధర్ మీద కోపం తగ్గడంతో భర్త తెచ్చిన మల్లెపూలు పెట్టుకుంటుంది వేద. ఈ పిక్నిక్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సంతోషాన్నిస్తుంది అనుకుంటుంది వేద. అంతలోనే యశోధర్ వచ్చి వేదతో ఒకటి చెప్పాలి అంటాడు. ఏంటి చెప్పు అనగానే పిక్నిక్‌కు ఆది కూడా వస్తాడు అంటాడు. ఇంకేం చాలా హ్యాపీ కదండీ.. ఆది అన్నయ్య వస్తున్నాడు అంటే ఖుషీ కూడా హ్యాపీగా ఫీలవుతుంది అంటుంది వేద. కానీ అసలు విషయం చెప్పేందుకు నసుగుతాడు యశోధర్. చివరకు ఆది పెట్టిన కండీషన్ చెప్తాడు. ‘ఆది వాళ్ల అమ్మతో కలిసి వెళ్దాం అంటున్నాడు’ అని యశ్ చెప్పగానే వేద నోట మాట రాక కుప్పకూలిపోతుంది. ‘ఆది, నేను, మాళవిక, ఖుషి.. మేం నలుగురం కలిసి పిక్నిక్ వెళ్దాం అంటున్నాడు’ అనగానే వేద వెక్కి వెక్కి ఏడుస్తుంది. వేదని ఓదార్చుతూ ఆది నన్ను ఫస్ట్ టైం అడిగాడు. కాదు అనలేకపోయా. అర్థం చేసుకో వేద అని బతిలాడుతాడు. అంతేకాకుండా ఖుషిని నువ్వే ఒప్పించి మాతో పంపించాలి అని వేదని రిక్వెస్ట్ చేస్తాడు యశ్. ఏం మాట్లాడలేక వెళ్లి ముఖం కడుక్కుంటుంది. తనని తానే అద్దంలో మాట్లాడుకుంటూ నిలదీసుకుంటుంది. ఎవరి నుంచి ఏం ఆశపడకు వేదా.. అని తనని తాను ఓదార్చుకుంటుంది. బెడ్ దగ్గరికి వచ్చి నన్ను ఎవ్వరూ పట్టించుకోరు అనుకుంటూ యశోధర్ ముందు బాధపడుతుంది.
మొన్నటి వరకు ఖుషి అన్నయ్య.. అన్నయ్య అంటే కలవనిచ్చార వాళ్లు. ఆదికి సడెన్‌గా ఖుషి మీద ఇంత ప్రేమ ఎలా పుట్టుకొస్తుంది. అడిగింది ఆదినే అయిన వెనకాలే ఉండి కథ మొదలుపెట్టిందెవరో మీకు తెలియదా? ఒళ్లంతా కుళ్లు.. నిలువెళ్లా విషమే ఆ మాళవికకు అని తిట్టుకుంటుంది. అది నాకు కూడా తెలుసు వేద.. నాకు కావాల్సింది ఆది ఆనందమే. ఒక తండ్రిగా వారిద్దర్ని కలపాలి అంటాడు యశ్. ‘ఓ.. అయితే డిసైడ్ అయిపోయారన్నమాట. పిక్నిక్ వెళ్లాలని ఫిక్స్ అయిపోయారు. ఇక నాతో పని లేదు. నేను వేస్ట్ పర్సన్’ అని ఎమోషనల్ అవుతూ సులోచన దగ్గరికి వెళ్తుంది వేద. అమ్మా.. అంటూ తలుపు తడుతుంది. కానీ సమయానికి సులోచన ఉండకపోవడంతో నన్నెవరు ఓదార్చాలి అమ్మా అనుకుంటూ కన్నీరు పెడుతుంది. ఇదంతా పక్కనే ఉండి గమనిస్తుంది మాళిని.
ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్న వేద దగ్గరికి వెళ్లి ఓదారుస్తుంది మాళిని. నేను అమ్మ లాంటిదానినే.. నాతో నీ బాధ పంచుకోకూడదా? అంటూ కోడల్ని అడుగుతుంది. అత్తయ్యని కౌగిలించుకుని గుక్క పెట్టి ఏడుస్తుంది వేద. ఏమైంది చెప్పు అని మాళిని పదే పదే అడగ్గా.. వేద జరిగిందంతా చెప్తుంది. నీ బాధ నాకు అర్థమైందమ్మా.. అంటూ కోడలికి ధైర్యం చెప్తుంది మాళిని. నా ఖుషి నాకు దూరమవుతుందేమోనని భయమేస్తుంది అత్తయ్య అంటూ ఏడుస్తుంది. నీ ఖుషిని నీ నుంచి ఎవరూ దూరం చేయలేరు.. కోర్టు ఇచ్చిన తీర్పుని గుర్తుచేసుకో అంటుంది మాళిని. ‘ఖుషి ఎప్పటికీ నీ బిడ్డే. అమ్మా అని పిలిచింది నిన్నే. ఖుషిని ఆది కోసం యశ్ తీసుకెళ్తున్నాడు. యశ్‌కి ఖుషి, ఆది రెండు కళ్లు. అన్నా చెల్లెల్లు ఆనందంగా గడుపుతారు. ఆ మాళవిక కుళ్లుకుంటే ఎంత. ఈ ప్రపంచంలో యశోధర్ అసహ్యించుకునే మనిషి ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది మాళవిక ఒక్కతే. దాని మెుఖం చూడడానికి కూడా ఇష్టపడరు’ అని కోడలికి భరోసానిస్తుంది.
నా బాధ్యత నాకు గుర్తుచేశారు. చాలా థ్యాంక్స్ అత్తయ్య అంటుంది వేద. ఖుషిని ఒప్పించే బాధ్యత నాకు అప్పగించారు. నాకు ఖుషి ఎలానో ఆది కూడా ఆయనకు అలానే కద. మీరు చెప్పిన మాటలు నాకెంతో ఊరటనిచ్చాయి అత్తయ్య అంటుంది. ‘నువ్ మా ఇంటి కోడలివి కాదమ్మా. కూతురివి’ అని ముద్దు పెట్టుకుంటుంది మాళిని. మరి ఖుషి యశ్‌తో వెళ్లడానికి ఒప్పుకుంటుందో లేదో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..