Viral Video: కుక్కను విశ్వాస జంతువుగా మనిషి పరిగణిస్తాడు. అందుకే తరతరాలుగా మనిషికి, కుక్కకు విడదీయరాని బంధం ఉంది. అందుకే పెంపుడు కుక్కలను చాలా మంది పెంచుకుంటూ ఉంటారు. వాటికి ఇష్టమైన ఫుడ్ పెడుతూ, కుటుంబంలో ఒక సభ్యుడిగా చూసుకుంటూ ఉంటారు. కాస్త అనారోగ్యం వచ్చినా ఆస్పత్రికి వెళ్లి మరీ దానికి వైద్యం చేయిస్తూ ఉంటారు.
విశ్వాసానికి మారుపేరైన కుక్క అనేక సందర్భాల్లో మనుషులను కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో కాపాడుతూ ఉంటాయి. అలాంటిదే ఈ వీడియోలో జరిగింది. ఈ వీడియోలో తన ఫ్రెండ్ చిలుకను కాపాడేందుకు ఓ శునకం ఏకంగా పాముపైనే అటాక్ చేసింది. వీరోచిత పోరాటం చేసిన ఈ శునకానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి ఏమైందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
సాధారణంగా పాములు ఇతర జంతువులను అటాక్ చేస్తూ చంపేస్తుంటాయి. కానీ ఓ శునకం ఏకంగా పాముపైనే పడి పోరాడటం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈ వీడియోలో అలాంటి సన్నివేశాన్ని చూడొచ్చు. ఓ పాము పక్షులు ఉన్న పంజరంలోకి ప్రవేశించాలని చూస్తుంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న శునకం చేరుకొని పాముపై కలబడుతుంది.
Viral Video: నోట కరిచి.. లాగేసిన శునకం
చిలుక ఉన్న పంజరం వద్దకు వెళ్లిన పాము.. చిలుకపై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కుక్క ఒక్కసారిగా పాముపైకి దూకేస్తుంది. పాము తోక పట్టుకొని నోటకరచి బయటకు లాగేస్తుంది. పాము తలను కూడా నోటితో కరిచి పక్కన పడేస్తుంది. పెనుగులాటలో పాము విడిపించుకొనేందుకు చాలా ప్రయత్నిస్తుంది. కానీ సాధ్యం కాదు. ఇలా చివరికి పంజరం లోపలిని నుంచి పామును పట్టి బయటకు లాక్కొస్తుంది శునకం. ఈ వీడియో చూసిన నెటిజన్లు శునకంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram