ఈ మధ్యకాలంలో గే, లెస్బియన్ పెళ్ళిళ్ళు ప్రపంచ వ్యాప్తంగా సర్వసాధారణంగా మారిపోయాయి. స్త్రీ,పురుష రిలేషన్ ఇష్టం లేని వారు సేమ్ జెండర్ రిలేషన్ లో ఉండటానికి ఇష్టపడుతున్నారు. కొంత మంది హార్మోన్స్ ప్రభావంతో సేమ్ జెండర్ రిలేషన్ ని కోరుకుంటున్నారు. మరికొంత మంది మాత్రం ఎలాంటి సమస్యలు లేకుండా కూడా సేమ్ జెండర్ రిలేషన్ ని ఇష్టపడుతూ ఉంటారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీ ప్రముఖుల వరకు ఇలా గే, లెస్బియన్ రిలేషన్స్ లో ఉన్నవారు సొసైటీలో ఉన్నారు. భారతదేశంలో కూడా సుప్రీం కోర్ట్ ఇలాంటి రిలేషన్ షిప్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొంత మంది అఫీషియల్ గా బయటకొచ్చి సంప్రదాయ పద్దతిలో పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు.
ఇలాంటి వివాహాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. గే, లెస్బియన్ వివాహాలు ప్రపంచ వ్యాప్తంగా ఒక్క ముస్లిం దేశాలలో తప్ప అన్ని చోట్ల సర్వసాధారణం అయిపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా అందాల పోటీలలో రెండు దేశాల తరుపున పాల్గొన్న ఇద్దరు భామలు లెస్బియన్ రిలేషన్ షిప్ తో ఒకటయ్యారు. ఒకరిపై ఒకరు మనసుపడి చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న ఆ ఇద్దరు భామలు తాజాగా పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
మిస్ అర్జెంటీనా మరియానా వరెలా, మిస్ ప్యూర్టో రికో ఫాబియోలా వాలెంటైన్ ప్రేమకథ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2020 పోటీలో వీరిద్దరూ వారి దేశాలకి ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొన్నారు. అలాగే టాప్ 10 అందాల భామల జాబితాలో కూడా నిలిచారు. అక్కడే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం. అది కాస్తా ప్రేమగా మారడం జరిగింది. గత రెండేళ్లుగా ఈ అందాల భామలు ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారు. తాజాగా మరియానా,, ఫాబియోలా వాలెంటైన్ తమ పెళ్లి కబురుని సోహల్ మీడియా వేదికగా వెల్లడించడంతో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. సోషల్ మీడియా కూడా ఒక్కసారిగా వీరి న్యూస్ వైరల్ గా మారిపోయింది.