రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో డెబ్యూ మూవీ లైగర్ సినిమాతో డిజాస్టర్ కొట్టాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని పూరి జగన్నాథ్ ఈ సినిమాని ఎస్టాబ్లిష్ చేసినా కూడా విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ తప్ప మిగిలిన క్యాస్టింగ్ మొత్తం బాలీవుడ్ నుంచే తీసుకున్నాడు. అలాగే సినిమాని కూడా ఎక్కువగా బాలీవుడ్ లోనే ప్రమోషన్ చేశాడు. నార్త్ ఇండియాలో ఫుల్ విజయ్ దేవరకొండని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఇక లైగర్ ఫ్లాప్ అయిన ఆ మూవీ కోసం చేసిన ప్రమోషన్ మాత్రం విజయ్ దేవరకొండకి బాగా ఉపయోగపడింది.
బాలీవుడ్ లో ఇమేజ్ పెరగడానికి లైగర్ సినిమా దోహదపడింది. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు ఏకంగా రెండు హిందీ ప్రాజెక్ట్స్ ని విజయ్ సెట్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. కరణ్ జోహార్ రీసెంట్ గా ఒక యువ దర్శకుడు చెప్పిన కథ విని దానిని విజయ్ దేవరకొండతో తెరకెక్కించాలని భావిస్తున్నట్లు టాక్. ఇప్పటికే విజయ్ తో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి సైన్ కూడా చేయించుకున్నాడని తెలుస్తుంది. అలాగే రెడ్ చిల్లీస్ బ్యానర్ లో విజయ్ దేవరకొండతో ఒక ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా సౌత్ లోకి కూడా ఈప్రొడక్షన్ హౌస్ అడుగుపెట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ రెండు ప్రాజెక్ట్స్ కి సంబంధించి వచ్చే ఏడాది అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని టాక్. ఇక ఇవి కాకుండా తెలుగులో ఖుషితో పాటు దిల్ రాజు బ్యానర్ లో ఒక ప్రాజెక్ట్, మైత్రీ మూవీస్ లో ఒక ప్రాజెక్ట్ కి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కమిట్ అయ్యి ఉన్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన మొత్తం అతని చేతిలో ఐదు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.