Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో గీతుని ఉద్దేశించి గతవారమే నీ ఆట ‘బొచ్చు’లా ఉందని నాగార్జున అన్న విషయం అందరికీ తెలిసిందే..! ఈవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో భాగంగా.. మిషన్ పాజిబుల్ టాస్క్ కొనసాగుతోంది. రెడ్ టీం.. బ్లూ టీంల మధ్య ఫిజికల్ గేమ్ ఘర్షణలకు దారితీసింది. పచ్చి బూతులు తిట్టుకోవడమే కాకుండా వ్యక్తిగత దూషణలతో గేమ్ సాగుతోంది.. ముఖ్యంగా ఇనయ, శ్రీసత్య, రేవంత్, శ్రీహాన్, గీతు, బాలాదిత్య నోరు పారేసుకుంటున్నారు.
తనని ఎంతో నమ్మిన ఆదిరెడ్డిని గీతూ గేమ్ లో భాగంగా వెన్నుపోటు పొడిచింది. ఆల్రెడీ టాస్క్ నుంచి డిస్ క్వాలిఫై కావడంతో చనిపోయిన గీతు తన అతి తెలివి ఉపయోగించి ఆదిరెడ్డిని మాటల్లో పెట్టి అతని దగ్గర రెడ్ స్ట్రిప్స్ నొక్కేసింది.చనిపోయిన వాళ్లు అలా చేయడానికి రూల్ లేదని.. తప్పు చేస్తున్నావ్ అని ఆదిరెడ్డి ఎంత చెప్పినా గీతు వినిపించుకోలేదు. బిగ్ బాస్ బుద్ధిబలంతో ఆడమంటే.. గీతు బుద్ధిలేకుండా ఆడి.. నేను బుద్ధిబలంతో ఆడానంటూ అడ్డంగా వాదించింది.
గేమ్ పాస్‌లో ఉంటే ఎలా దొంగతనం చేస్తావ్.. అని ఆదిరెడ్డి అంటే.. నేను వెధవని.. వెధవన్నార వెధవని.. అంటూ తన వ్యక్తిత్వాన్ని తాను బయటపెట్టుకుని అడ్డంగా వాదించింది గీతు.నీది ఇదేం బుద్ది గీతూ అని ఆదిరెడ్డి అంటే..‘నా బుద్ది ఏంటో జనాలు డిసైడ్ చేస్తారు.. మీరు నాకు చెప్పాల్సిన పనిలేదు. మేం చేసింది దొంగతనం కాదు.. నేను తెలివితో ఆడా.. బుద్ధి బలంతో ఆడా.. నీ మంచి తనం నీ వీక్నెస్.. నా బుద్ధిబలం ఉపయోగించి నీకు తెలియకుండా లూప్ ఎక్కించా.. నాట్రాప్‌లో నువ్వు పడ్డావ్.. నీకే తెలియకుండా నీ బ్రెయిన్‌ని మార్చేశా.. మాటలతో మజిలీ చేశా’ అంటూ సోది కబుర్లు చెప్పింది.. తాను ఆడిన తుప్పాస్ గేమ్ కరెక్ట్ అంటూ వాదించింది.
బిగ్ బాస్ రంగంలోకి దిగకతప్పలేదు. ఇంటి సభ్యుల్ని అందర్నీ పిలిచి మరీ.. రోతక్కి లెఫ్ట్ అండ్ రైడ్ ఇచ్చేశారు. ‘టాస్క్‌లో చనిపోయిన సభ్యులు.. భౌతికంగా పాల్గొనలేరు. గీతు ఆదిరెడ్డి టీషర్ట్‌ని దొంగిలించి రెడ్ స్ట్రిప్స్ దొంగించింది.. కాబట్టి అవి చెల్లని కారణంగా ఆదిరెడ్డి చనిపోలేదని బిగ్ బాస్ తెలియజేశారు. బిగ్ బాస్ ఆ మాట చెప్పగానే.. ఏ మాత్రం సిగ్గులేకుండా గీతు చప్పట్లు కొడుతూ కనిపించింది.. ఇదేం సిగ్గులేని జన్మో అర్ధం కాదు కానీ.. బిగ్ బాస్ గీతు అని పేరు పెట్టి చెప్పినా.. నన్ను కాదు అన్నట్టుగా చప్పట్లు కొట్టింది. గేమ్ మొత్తం ఆపేసి మరీ బిగ్ బాస్ తిడుతుంటే చెంపలపై చేతులుపెట్టుకుని ఈ… అని నవ్వుతూ కూర్చుంది.