Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’, ప్రముఖ దర్శకుడు జాగర్లమూవీ క్రిష్ ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మూవీని భారీ చిత్రాల నిర్మాత ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ‘వీరమల్లు’ చిత్రం షూటింగ్‌కు సంబంధించి ఇదివరకే మూడు షెడ్యూల్స్ వరకు పూర్తయ్యాయి. ఇటీవలే మరో షెడ్యూల్ కూడా మొదలైంది.
‘హరిహర వీరమల్లు’ సినిమాలో పవన్ ఓ వజ్రాల దొంగగా కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం సుమారు రూ.8 నుంచి రూ.10 కోట్ల మేర నిర్మాతలు ఖర్చు చేస్తున్నారట. ఈ ఫైట్ సీన్ సినిమాలోని కీలక సమయంలో రానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల నిర్వహించిన పలు వర్క్ షాప్‌ల్లో పవన్ కూడా పాల్గొన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పవర్ స్టార్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ ఫిల్మ్
పవర్ స్టార్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీగా ‘హరిహర వీరమల్లు’ను చెబుతున్నారు. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలని పవన్ భావిస్తున్నారు. ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. వచ్చే ఏడాది వేసవి కానుకగా ‘వీరమల్లు’ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం బిజినెస్ కూడా ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ టిప్స్ భారీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది.
Pawan Kalyan: సురేందర్ రెడ్డితో మూవీపై క్లారిటీ!
ఇకపోతే, పవన్ కల్యాణ్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఈ మూవీ వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను రామ్ తాళ్లూరి ఖండించారు. త్వరలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.