సౌర్యని చూడాలని ఎంతో ఆతృతగా ఇంద్రుడి వెంటవెళతారు కార్తీక్, దీప. అక్కడికి వెళ్లిన వీరికి సౌర్యకి బదులు వేరే అమ్మాయిని తమ కూతురని చూపిస్తుంది చంద్రమ్మ. దాంతో బాధ పడుతూ బట్టలు, నగలు ఆ అమ్మాయికి ఇచ్చేసి వచ్చేస్తుంది దీప. ఇంటికి వచ్చిన తర్వాత కూడా సౌర్య గురించే ఆలోచిస్తూ బాధ పడుతుంటుంది. అలాగే.. తనని చంపడానికి వాల్తేరు వాణి అనే కిరాయి రౌడీని మోనిత సెట్ చేసిందని తెలిసి కోపంతో ఊగిపోతుంది. సరాసరి మోనిత దగ్గరకి వెళ్లిన తన చెంప పగుల గొడుతుంది. ఆ తర్వాత నవంబర్ 3న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం.
ఇంటికి వచ్చిన తర్వాత కూడా సౌర్య గురించే ఆలోచిస్తూ బాధ పడుతుంటుంది దీప. ఇంతలో దుర్గ అక్కడికి ఆటో తీసుకుని వస్తాడు. ఇంద్రుడు దగ్గరే సౌర్య ఉందన్న అనుమానం తీర్చుకోడానికి వెళదాం రమ్మంటాడు దుర్గ. దాంతో.. ‘ఒకరు నా భర్తని దోచుకోవాలని చూస్తుంటే.. మరొకరు నా కూతురిని దాచేయాలని చూస్తున్నారు. నా జీవితంలో బాధలు తప్ప సంతోషాలు లేవు’ అని బాధగా అంటుంది దీప. దాంతో.. కష్టాలు కొత్తకాదు కదా అని చెప్పి సౌర్య గురించి ఆరా తీద్దాం రా అంటూ తీసుకెళతాడు దుర్గ.
ఇంకోవైపు.. కారులో ఎక్కడికో వెళుతూ ఉంటుంది. అదే సమయంలో.. ఏం చేసిన దీప ఊరి నుంచి వెళ్లిపోవట్లేదని కోపంగా అనుకుంటుంది మోనిత. ఇంతలో కారు ఆగిపోవడంతో కార్తీక్‌కి ఫోన్ చేస్తే బిజీ వస్తుంది. దాంతో.. ఎవరితో మాట్లాడుతున్నాడని అనుమానపడుతుంది మోనిత. అలాగే గతం ఏమైన గుర్తొంచ్చిందేమోనని డౌట్ పడుతుంది. కానీ ఇంతలోనే అదేం లేదని తనలో తానే అనుకుంటుంది. అక్కడ కారులో వెళుతున్న కార్తీక్.. ఇంద్రుడు ఎందుకు అలా కంగారుగా ఉన్నాడని అనుమానంగా అనుకుంటాడు కార్తీక్. మరోవైపు.. సౌర్య తన దగ్గరే ఉందనే అనుమానం కార్తీక్‌కి వచ్చిందని, అందుకే ఊరు నుంచి వెళ్లిపోవాలని అనుకుంటాడు ఇంద్రుడు. ఇంతలో అతని ఆటోని మోనిత ఆపి ప్రకాశ్ నగర్ వెళ్లాలని చెబుతుంది. మోనితని గుర్తు పట్టేసిన ఇంద్రుడు ఆమెకి తను తెలియదు కదా అని ఆటో ఎక్కించుకుంటాడు ఇంద్రుడు.
దుర్గతో కలిసి ఇంద్రుడి ఇంటికి వెళుతుంది దీప. ఆమె లోపలికి వెళుతుండగా.. అక్కడికి వచ్చిన చంద్రమ్మ ఎందుకు వచ్చారని అడుగుతుంది. దానికి పాపని ఒకసారి చూపించమని అంటుంది దీప. దానికి ఆమె ఇంట్లో లేదని, బంధువుల ఇంటికి వెళ్లిందని చెబుతుంది చంద్రమ్మ. దీప ఎంత రిక్వెస్ట్ చేసిన వినకుండా కసురుకుంటుంది. దాంతో ఏం చేయలేక వెనుదిరుగుతుంది దీప. ఇంతలో ఆటోలో వెళుతున్న మోనితకి కార్తీక్ కనిపిస్తాడు. ఆమె ఇంద్రుడు ఆటోలోంచి దిగుతుండగా చూసిన కార్తీక్ అతన్ని గుర్తు పడతాడు. కార్తీక్ ఆపమన్న వినకుండా పనుందని వెళ్లిపోతాడు ఇంద్రుడు. దాంతో.. కార్తీక్‌లోని అనుమానం ఇంకా పెరుగుతుంది. అదే సమయంలో.. సౌర్యని ఇంద్రుడి దగ్గర దాచింది మోనిత కూడా కావొచ్చని అనుమానపడతాడు కార్తీక్. అనంతరం మోనిత కారు తీసుకురావడానికి ఇద్దరు వెళతారు.
బోర్ కొడుతుందని చెప్పి ఆనందరావు, హిమ కలిసి హెడ్ అండ్ టెయిల్స్ ఆడుతుంటారు. అప్పుడు వరుసగా మూడు సార్లు ఎవరు గెలిస్తే వారు చెప్పింది ఇంకొకరు చేయాలని డీల్ కుదుర్చుకుంటారు. అప్పుడు తాను గెలిస్తే సౌర్య దగ్గరకి తీసుకెళ్లాలని అడుగుతానని అనుకుంటుంది హిమ. అనంతరం కాయిన్ ఎగరేస్తే మూడు సార్లు హిమనే గెలుస్తుంది. అయితే.. మూడో సారి వేసిన తర్వాత కిందపడిన కాయిన్‌ని చూస్తే రెండుగా విడిపోయి ఉంటుంది. అది చూసి తన సౌర్య కోసమే అలా చేశానని అంటుంది హిమ. అర్థం చేసుకున్న ఆనందరావు మనవరాలిని సౌర్య దగ్గరకి వెళదామని చెబుతాడు. అక్కడ సౌర్యని చూడడం కుదరకపోవడంతో కూతురి గురించి ఆలోచిస్తూనే ఆటోలో ఇంటికి వస్తుంది దీప. ఇంకా చంద్రమ్మ మీద అనుమానం తీరలేదని దుర్గకి చెబుతుంది దీప. దాంతో.. సౌర్య అక్కడే ఉందని ఎలా చెబుతున్నావని ప్రశ్నిస్తాడు దుర్గ. అక్కడితో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. సౌర్యని దీప చేరుకుంటుందా లేదా తరువాతి ఎపిసోడ్స్‌లో చూడండి.