తన తండ్రెవరో తెలుసుకోవాలని ఆరాటపడుతుంది దేవి. అపుడే అక్కడ కనిపించిన సోది చెప్పే ఆవిడని ఇంటికి తీసుకెళ్తుంది. రాధతో ఆమె నీ పెనిమిటికి గండం ఉంది నువ్ నీ భర్తతో కలిసి పూజ చేయాలని చెప్తుంది. దాంతో రాధ భయపడి ఆదిత్యకు ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్‌లో చూద్దాం..
ఆదిత్యతో కలిసి పూజ చేసేందుకు రుక్మిణి రెడీ అవుతుంది. తల్లినే కనిపెట్టుకుంటా ఉంటుంది దేవి. మా అమ్మకు కూడా నాయన అంటే మస్తు ఇష్టం ఉన్నది అనుకుంటుంది దేవి మనసులో. ఆ తర్వాత రాధ ఊరి చివరన ఉన్న గుడికి వెళ్తుంది. రాధ వెనకాలే తెలియకుండా దేవి కూడా అక్కడికి వెళ్తుంది. భర్త కోసం గుడిలో ఎదురు చూస్తుంటుంది రుక్మిణి. అంతలోనే ఆదిత్య కారులో వస్తాడు అక్కడికి. తన తండ్రి దొరకాలని దేవి దండం పెట్టుకునే లోపే ఆదిత్య, రుక్మిణిలు మాయమవుతారు అక్కడినుంచి. నాయన వచ్చిండా అమ్మ కనిపిస్తలేదు అనుకుంటూ గుడి అంతా వెతుకుతుంది దేవి. ఆదిత్యను ముందు పెట్టుకుని దీపాలు పెడుతున్న తల్లిని చూసి షాకవుతుంది. ఆదిత్యే తన తండ్రి అని సంబరపడిపోతుంది. ఆదిత్యతో కలిసి ఉన్న రోజుల్ని తలుచుకుంటూ సంతోషపడుతుంది. దేవుడి దగ్గరికి వెళ్లి థ్యాంక్స్ చెప్తుంది.
అదే గుడికి వచ్చి రాధని ఆదిత్యతో చూస్తాడు మాధవ్. దీపాలు పెట్టడం పూర్తయిన తర్వాత రాధ పెనిమిటితో కలిసి దేవుడికి దండం పెట్టుకుంటుంది. నేను, నా బిడ్డ, రుక్మిణి కలిసి ఉండే అదృష్టాన్ని ఇవ్వమని దేవుడిని వేడుకుంటాడు ఆదిత్య. బిడ్డని తండ్రి దగ్గరికి పంపించే కోరిక తీర్చమని రుక్కు వేడుకుంటుంది. మాధవ్ మాత్రం సత్యకు ఫోన్ చేసి గుడిలో జరుగుతున్నదంతా చెప్పుకుంటూ బాధపడుతున్నట్టు నటిస్తాడు. దాంతో సత్య కోపంతో రగిలిపోతుంది. నాయనని చూస్తే ఖుషీగా ఉంది. మా నాయన మంచోడు కానీ మా అమ్మ ఎందుకు దూరంగా ఉంచుతుందో అర్థం కావట్లేదు అనుకుంటుంది.
సీన్ కట్ చేస్తే.. ఆదిత్య గురించి ఆలోచిస్తుంది దేవుడమ్మ. భర్త వచ్చి ఏమైంది దేవుడమ్మ అని అడగ్గా.. తన కొడుకు గురించి ఆలోచిస్తున్నట్టు చెప్తుంది. నీ కొడుకు ప్రయోజకుడు అయ్యాడు కదా ఇంకేంటి అంటాడు భర్త. ప్రయోజకుడు అయ్యాడు కానీ బయటి విషయాలు పట్టించుకుంటున్నట్టు ఇంటి విషయాలు పట్టించుకోవట్లేదు. ఇన్ని రోజుల నుంచి చెప్తున్నా రుక్మిణి ఆచూకీ తెలుసుకోలేకపోయాడు కానీ ఫోటో మాత్రం పుస్తకాల్లో పెట్టుకుని తిరుగుతున్నాడు అంటుంది ఈశ్వరప్రసాద్‌తో. సత్య లాంటి వాళ్లున్నంత కాలం మనం ఏది అనుకున్నా ఈజీగా చేసేయవచ్చు. ఒక విషయం చెప్తే ఎందుకు చెప్తున్నాడు అందులో ఉన్న అర్థం గురించి ఆలోచించకుండా పెడార్థాలు తీసుకుంటా ఉంటే అంతకుమించి మనకు కావాల్సింది ఏముంది. ఆదిత్యని బ్యాడ్ చేసేందుకు సత్య నాకు మంచి ఆయుధంగా దొరికింది. అలాంటి వాళ్లు ఉన్నంతకాలం మనం చేయాలనుకున్నది ఈజీగా చేసేయవచ్చు అనుకుంటాడు మనసులో.
ఆ తర్వాత సీన్‌లో మాధవ్ చేతికి ఉన్న పచ్చబొట్టు పోతుంది. స్కెచ్‌తో చేతి మీద దేవిపేరు రాసుకుంటాడు. ఎందుకు రాధా..నన్ను చెడ్డవాడిని చేస్తున్నావ్. నువ్వంటే నాకిష్టమని చెప్పినా వినట్లేదు. దేవికి తండ్రిగా ఉంటే నీకు భర్తలా ఉండలేనని అర్థమయింది. అందుకే ఎవరినో చూపించి మీ తండ్రి అని నమ్మించాను. కన్న తండ్రి కళ్లెదురుగా ఉన్న దూరం చేశాను. నువేం చేసినా చివరికి నా సొంతం కావాల్సిందే. ఎందుకంటే ఇదిగో మీ నాన్న అని దేవికి నువ్ ఆదిత్యని చూపించలేవు. చూపించాలంటే వంద ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అందుకే నిన్ను పద్మవ్యూహంలో అర్జునిడిలా బంధించాను అని విర్రవీగుతాడు మాధవ్. ఇదంతా చాటుగా వింటుంది చిన్మయి. మరి తండ్రిని ఎలా శిక్షిస్తుందో చూడాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..