Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో వసుధర ఎగ్జామ్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి మాట్లాడుతుండగా ఆ మాటలన్నీ రిషి వింటాడు. ఆ తర్వాత ఏం జరిగింది కంగారు పడుతున్నావు అని రిషి అడుగుతాడు. దాంతో రిసల్ట్ గురించి అని చెప్పటంతో.. ఏమి కాదు అంటే ధైర్యం ఇస్తాడు రిషి. ఆయన కూడా వసు టెన్షన్ పడుతూ ఉండగా ఒక చిన్న హెల్ప్ చేయమని అంటుంది వసు.
తర్వాత ఇద్దరు ఊరు అవతల ఉన్న చెరువు దగ్గరికి వెళ్లగా అక్కడ రిషి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు. దాంతో కాగితపడవలు చేసి దాని మీద మన మనసులో కోరిక చెప్పుకొని చెరువులో వదిలితే ఆ కోరిక తీరుతుంది అంట అని అంటుంది వసు. మీరు కూడా ఒక కోరిక కోరుకొని వదిలేయండి అని అంటుంది. దాంతో ఇద్దరు తమ కోరికలు కోరుకొని నీళ్లలో పడవలను వదిలేస్తారు.
ఆ తర్వాత రిషి నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అని ఆశ్చర్యంగా అడుగుతాడు. దానికి ఒక స్టోరీ చెబుతుంది వసు. తర్వాత మాటల్లో మధ్యలో మీరు గ్రేట్ సార్ అని రిషి ని పొగుడుతుంది. నేను అడగగానే నా సరదా తీర్చారు అని అంటుంది. దాంతో అది నా బాధ్యత అని అంటాడు రిషి.
ఆ తర్వాత నువ్వు కాలేజ్ టాపర్ అయితావు. అప్పుడు డాడీ వాళ్ళు వస్తారు. ఆ తర్వాత మన పెళ్లి గురించి చెబుతాను అని సంతోషంగా అంటాడు. మరోవైపు దేవయాని ధరణి దగ్గరకి వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అంతే కాకుండా వెటకారంగా మాట్లాడుతుంది. ధరణి ఏంటో అత్తయ్య గారు చాలా కోపంగా ఉన్నట్లున్నారు అని అనుకుంటుంది.
రిషి ఎక్కడ అని అడుగుతుంది. దాంతో ధరణి రిషి బయటికి వెళ్ళాడు అని చెబుతుంది. వెంటనే దేవయ్యని ఒక్కడైనా అది కూడా వెళ్లిందా అని అడుగుతుంది. అయిన ఇద్దరు వెళ్లే ఉంటారు పెళ్లి కాకముందు వీళ్ళు ఇలా తిరిగితే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు అని అంటుంది. మొగుడు పెళ్ళాలు లాగా తిరుగుతున్నారు అంటూ వారిపై ఆడిపోసికుటుంది దేవయాని.
వెంటనే ధరణి నేను ఒక మాట మాట్లాడొచ్చా అని అంటుంది. అంత దేవయాని సరే అనడంతో కలిసి తిరిగితే తప్పేముంది అని.. వసు గొప్పతనం గురించి చెబుతుంది. దాంతో దేవయానికి మండుతుంది. ఇక ధరణి మాటలకు.. ఈ మధ్య నీకు తెలివితేటలు ఎక్కువయ్యాయి అని అంటుంది. దాంతో ధరణి కౌంటర్ చేస్తూ వెటకారంగా మాట్లాడుతుంది.
Guppedantha Manasu:
తర్వాత దేవయాని వీళ్లిద్దరు ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తుంది. ఓ వైపు వసు చాలా సంతోషంగా ఉంటుంది. రిషి ని బాగా పొగుడుతుంది. దానితో రిషి నన్ను చాలా ఎత్తుకు పొగిడేస్తున్నావు అంటూ.. ఇలాగే జీవితకాలం ఉంటావా అని అడగటంతో.. జన్మజన్మలకి మీతోనే ఉంటాను అని వసుధారా అంటుంది.