యశోధర్ మాళవికతో క్లోజ్‌గా ఉండడం జీర్ణించుకోలేకపోతుంది వేద. అందుకే భర్త మీద కోపంతో ఉంటుంది. భార్యని కూల్ చేసేందుకు యశోధర్ ప్రయత్నాలు చేస్తాడు. అక్కడ అభిమన్యు వేదతో మాళవిక, యశోధర్‌ల బంధం గురించి చెప్పి తనని రెచ్చగొడతాడు. కానీ వేద తన భర్తనే నమ్ముుతంది. ఆ తర్వాత నవంబర్ 3 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
అన్నం తినిపించమని ఖుషి మారాం చేస్తుంది. ఎంత చెప్పిన వినకపోవడంతో వేదనే తినిపిస్తుంది చివరకు. ఆ తర్వాత బోర్ కొడుతుంది అమ్మా.. పిక్నిక్‌కి వెళ్దామా అని అడుగుతుంది ఖుషి. సరే మీ డాడీ వచ్చాక నేను మాట్లాడతా అంటుంది వేద. ఖుషి వెళ్లిన తర్వాత ఈ ఐడియా ఏదో బాగుంది.. అనుకుంటుంది వేద మనసులో. ఈ పిక్నిక్ వల్ల మీరు కూడా రిలాక్స్ అవుతారు. నాకంటే ఇపుడు మీకే ఎక్కువ వెళ్లాల్సిన అవసరం ఉంది అనుకుంటుంది మళ్లీ. వేద కోపం చల్లార్చాలని యశ్ మల్లెపువ్వులు తీసుకొని వస్తాడు. ఇంటి దగ్గర వేద, ఖుషి ఎదురు చూస్తుండగానే యశ్ వస్తాడు. భర్త మల్లెపువ్వులు తెచ్చింది చూసి వేద సంబరపడుతుంది.
సీన్ కట్ చేస్తే.. ఆది నిద్రలో కలవరిస్తాడు. అమ్మా.. అని వెళ్లి మాళవిక ఒడిలో పడుకుంటాడు. నువ్ రిఫ్రెష్ అవ్వాలంటే ఎక్కడికైనా పిక్నిక్ వెళ్దాం అంటుంది మాళవిక. నువ్వు, నేను, నాన్న, ఖుషి మనం ఫ్యామిలీ అంటుంది. నాన్న వస్తాడా అని ఆది అడగ్గా.. తప్పకుండా వస్తాడు అంటుంది. నాకు కూడా ఖుషితో గడపాలని ఉంది అంటుంది. దాంతో ఆది నేను నాన్నకు ఫోన్ చేస్తానంటూ వెళ్తాడు. అక్కడ కూడా సీన్ సేమ్ రిపీట్ అవుతుంది. ఖుషి కూడా యశ్‌తో మనం ముగ్గురం కలిసి పిక్నిక్ వెళ్దాం అంటుంది. మంచి ఐడియా.. తప్పకుండా వెళ్దాం అంటాడు యశ్. అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం అంటాడు. అంతలోనే ఆది ఫోన్ చేస్తాడు. ఏంటి ఆది అని అడగ్గా.. ‘నాన్నా నాకు మీతో కలిసి పిక్నిక్ వెళ్లాలని ఉంది’ అంటాడు. సరే తప్పకుండా రేపు ప్లాన్ చేస్తా నాన్నా అంటాడు. మనతో మాళవిక అమ్మ కూడా వస్తుంది అంటాడు ఆది. దాంతో యశ్ నోట మాట రాదు. ప్లీజ్ నాన్నా.. ఒప్పుకోండి నాకోసం అని రిక్వెస్ట్ చేస్తాడు. నీకోసం ఏమైనా చేస్తాను రా.. నీ తర్వాతే నాకు ఎవరైనా అంటాడు యశ్.
నాన్న పిక్నిక్‌కు ఒప్పుకున్నందకు హ్యాపీగా ఉందంటుంది ఖుషి తల్లితో. వేద కూడా మనసులోనే భర్తకు థ్యాంక్స్ చెప్పుకుంటుంది. అక్కడ మాళవిక వేదని టార్గెట్ చేస్తుంది. యశోధర్‌కి మాత్రం ఏం చేయాలో తోచక జుట్టు పీక్కుంటాడు. భర్త మీద కోపం తగ్గిపోతుంది వేదకు. ఇప్పుడిప్పుడే తనకు దగ్గరవుతున్న ఆది గురించి తపించిపోతాడు యశ్. కానీ వేద లేకుండా వెళ్లడం అంటే ఎలా? అని తనలో తానే కుమిలిపోతూ ఎటూ తేల్చుకోలేకపోతాడు. మరి చివరికి యశ్ ఎవరితో పిక్నిక్ వెళ్తాడో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..