Viral Video: స్దానబలం అనేది ఒకటుంటుంది. ఈ బలం వల్ల శత్రువులకు భయపడే అవసరం ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జనాల్ని చంపే జంతువుల్లో ముసలి ఒకటి. ఇది ఉభయచరం కాబట్టి దీంతో జాగ్రత్తగా ఉండాలి. అదే ముసలి నీటిలో ఉంటే ఇక చెప్పే అవసరం కూడా లేదు. ఎంత పెద్ద జంతువైనా దీని ముందు నిలబడలేదు. చివరికి ఏనుగు వచ్చినా ఏమిచేయలేదు.ఏనుగుని పట్టుకున్న ముసలి కథలు మనం చాలా సార్లు విన్నాం.
దీంతో మనం అర్థం చేసుకోవచ్చు నీటిలో ఉంటే ముసలి ఎంత ప్రమాదకరమో. గజరాజే ముసలిని ఏమీ చేయలేకపోతే ఇక మాములు వాళ్ళ సంగతి ఏంటి. కానీ ఒక ఆవు అందరిని ఆశ్చర్యపరిచింది. ముసలి నోట చిక్కినా కూడా ఆ ఆవు ధైర్యంగా పోరాడి బ్రతికి బట్టకట్టింది. అందరినీ విస్మయానికి గురిచేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియో సారాంశం ఏంటంటే బాగా దాహంగా ఉన్న ఒక ఆవు దగ్గరలోని చెరువు దగ్గరికి వెళ్ళింది. అక్కడే నక్కిన ఒక ముసలి చటుక్కున ఆ ఆవుని పట్టుకుంది. కాలిని చేజిక్కించుకుని ఆవుని నీటిలోకి ముంచడానికి ముసలి విశ్వప్రయత్నం చేసింది. ఆవు కూడా తక్కువ తినలేదు. తన ప్రాణాల కోసం ఎంతలా పోరాడిందంటే ముసలి పట్టు సడిలి ఆవు తప్పించుకోగలిగింది. ఆ ఆవు వీరగాధ సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Viral Video:
ప్రస్తుతం ఈ వీడియో గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ముసలి పట్టు నుంచి ఆ ఆవు ఎలా తప్పించుకోగలిగింది అనే దాని గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ వీడియో ఎవరు తీశారు,ఎక్కడ తీశారు అనే దాని మీద మాత్రం సమాచారం లేదు. ఈ ఆవు వీరగాధ మాత్రం మెచ్చుకోతగ్గది
https://www.instagram.com/reel/CkX1f1VIeX3/?utm_source=ig_embed&ig_rid=701836a7-5499-40e5-8cbc-5c1b4ce9ed97