Prithviraj: సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, విడాకులు, వివాదాలు అనేవి చాలా సాధారణం. ఏ హీరో లేదంటే హీరోయిన్ విడిపోతారో, ఎవరిని పెళ్లి చేసుకుంటారో తెలియకుండా ఉంటాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది లేటు వయసులో కూడా పెళ్లిళ్లు చేసుకుంటూ, ప్రేమాయణాలు నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. పైగా ముదురు వయసులో టీనేజ్ అమ్మాయిలను ప్రేమించి లేదంటే పెళ్లి చేసుకొని వార్తల్లో నిలుస్తుంటారు.
తాజాగా ఇలాంటి వార్తతోనే ఓ ముదురు హీరో అందరికీ షాకిచ్చాడు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో టాప్ హీరోలతో పాటు నటించిన నటుడు, హీరో పృథ్వీరాజ్ అందరికీ షాకిచ్చాడు. తన కన్నా 32 సంవత్సరాల చిన్న వయసు అమ్మాయితో లవ్ లో ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలుగులో పెళ్లి సినిమాతో బాగా పాపులర్ అయిన పృథ్వీరాజ్.. తెలుగులో అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
56 సంవత్సరాల వయసున్న పృథ్వీరాజ్ 24 సంవత్సరాల అమ్మాయిని సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా తాను ఈ వయసులో ఒంటరిగా ఉండలేకపోతున్నానని, అందుకే తాను 24 ఏళ్ల శీతల్ తో ఉండాలనుకున్నట్లు పృథ్వీరాజ్ బాహాటంగా తెలిపాడు. తనకన్నా వయసులో చిన్నదైన శీతల్.. మనసు పరంగా ఎంతో పరిణతి చెందిందని చెప్పాడు.
Prithviraj:
మొదటి భార్య నుండి విడాకులు తీసుకున్న పృథ్వీరాజ్.. చాలా సంవత్సరాలుగా శీతల్ తో లవ్ లో ఉన్నాడు. చెట్టాపట్టాల్ వేసుకొని ఇండస్ట్రీలో పలు కార్యక్రమాలకు కూడా హాజరైన శీతల్, పృథ్వీరాజ్ లు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని, త్వరలోనే వీరు అధికారికంగా ఓ ఫంక్షన్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.