మజ్ను సినిమాతో నటిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మలయాళీ కుట్టి అనూ ఇమ్మాన్యుయేల్. ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే నటిగా మెప్పించి తరువాత వరుసగా అవకాశాలని సొంతం చేసుకుంది. కళ్ళతో అభినయం చేయగల అతి కొద్దిమంది హీరోయిన్స్ లలో అనూ ఒకరుగా పేరు తెచ్చుకుంది. తరువాత కెరియర్ లో ఏకంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విశాల్ లాంటి స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ ని అనూ కొట్టేసింది. నటిగా ఈ బ్యూటీ ఆయా సినిమాలలో తక్కువ నిడివి ఉన్న పాత్రలలో కనిపించిన ఎంతో కొంత మెప్పించింది అని చెప్పాలి. గ్లామర్ పాత్రలకి కూడా సై అనడంతో ఈ అమ్మడుకి ఫ్లాప్స్ పడినా కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. బోల్డ్ క్యారెక్టర్స్ లో, ఇంటిమేట్ సీన్స్ లో కూడా నటించడానికి అనూ ఏ మాత్రం మొహమాట పడదు.
అదే ఇప్పటికి అమ్మడుని టాలీవుడ్ లో దర్శకుల దృష్టిలో పడేలా చేస్తుంది. ప్రస్తుతం అల్లు శిరీష్ తో ఊర్వశివో రాక్షసివో అనే సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ జోడీగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మోడ్రన్ అమ్మాయిగా, ఆధునిక అమ్మాయిల భావజాలంతో ఉన్న హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే ట్రైలర్ గా ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అనేది క్లారిటీ వచ్చేసింది. లైఫ్ లో పెళ్ళికి అంత ప్రాధాన్యత ఇవ్వని అమ్మాయి పాత్రలో ఆమె కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అనూ ఇమ్మాన్యుయేల్ తన కెరియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నటిగా తాను చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కాని నేను ఫెయిల్ కాలేదు.
కళ్ళతో నటించే అమ్మాయి అనే గుర్తింపుని తెచ్చుకున్నాను అంటే నటిగా నేను సక్సెస్ అయినట్లే. అయితే ఫ్లాప్స్ తర్వాత కథల ఎంపికలో నా ఆలోచనలు మార్చుకున్న మూస కథలు, రొటీన్ కమర్షియల్ తరహా హీరోయిన్ పాత్రలకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. నా దగ్గరకి వచ్చే కథలలో మనసుకి నచ్చే పాత్రలు మాత్రమే చేయడానికి ఒప్పుకుంటున్న. అలా ఊర్వశివో రాక్షసివో సినిమాలో పాత్ర కూడా నిజజీవితానికి నా ఆలోచనలకి దగ్గరగా ఉంటుంది.
అందుకే దర్శకుడు చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాను అని చెప్పింది. నిజ జీవితంలో నేను ఎలా ఆలోచిస్తానో అలాగే కెరియర్ గురించి ఎక్కువ ఆలోచించే ఆధునిక అమ్మాయి పాత్రలో నేను కనిపిస్తా అని చెప్పుకొచ్చింది. ఇక దీని తర్వాత రావణాసుర సినిమాలో కూడా ఇంటరెస్టింగ్ పాత్రలోనే కనిపిస్తానని చెప్పింది. దాంతో పాటు ఓటీటీ ప్రాజెక్ట్ కూడా ఒకటి కమిట్ అయినట్లు క్లారిటీ ఇచ్చింది.