Janhvi Kapoor : సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అద్భుతమైన సాంప్రదాయ వస్త్రాలను ధరిస్తూ రోజుకో ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తోంది. త్వరలో విడుదల కాబోతోన్న తన సినిమా మిలీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ఈ చిన్నది సోషల్ మీడియా ద్వారా మూవీకి హైప్ తీసుకువచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఓ వైపు ప్రమోషన్‌ల కోసం తిరిగేస్తూనే మరోవైపు ఫ్యాషన్ అవుట్‌ఫిట్స్‌తో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది. తాజాగా జాన్వీ కపూర్ రెడ్ కలర్ లెహెంగా సెట్ వేసుకుని కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

మలయాళం చిత్రం హెలెన్ కు రీమేక్‌గా మిలీ ని హిందీ లో అదే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు బోనీకపూర్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా టైటిల్ పాత్రను జాన్వీ కపూర్ పోషిస్తోంది. మలయాళంలో హిట్ అయిన ఈ సినిమాను హిందీలోనూ హిట్ చేయాలన్న తపనతో నటి జాన్వీ కపూర్ ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఫిల్మ్ ప్రమోషన్ డైరీల స్నిప్పెట్స్‌ను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.

లేటెస్ట్‌గా జరిగిన ప్రమోషన్ ఈవెంట్ కోసం జాన్వీ రెడ్ కలర్ సిల్క్ లెహెంగాను వేసుకుని బబ్లీ లుక్‌తో కవ్వించింది. బ్లూ, ఎల్లో, మెరూన్ షేడ్ ప్యాట్రన్స్‌తో వచ్చిన రెడ్ కలర్ స్లిప్ బ్లౌజ్‌ను వేసుకుని దానికి జోడీగా అవే ప్యాట్రన్స్‌తో వచ్చిన పొడవాటి రెడ్ స్కర్ట్‌ను ధరించింది. ఈ అవుట్‌ఫిట్‌లో కలర్ ఫుల్ లుక్స్‌తో యూత్‌ను కట్టిపడేసింది జాన్వీ కపూర్..ఈ అవుట్‌ఫిట్‌కు మ్యాచింగ్‌గా మెడలో స్కై బ్లూ కలర్‌తో డిజైన్ చేసిన చోకర్ నెక్‌లెస్‌ను అలంకరించుకుంది. ఈ హాట్ ఫోటో షూట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ” రంగీన్” అని క్యాప్షన్‌ను జోడించింది.

జాన్వీ పోస్ట్ చేసిన ఈ ఎత్నిక్ వేర్ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. లైక్స్ , కామెంట్లతో ఇన్‌బాక్స్ ఫుల్ అయిపోయింది. జాన్వీ కజిన్స్, సిస్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ ఆమె అందాలను పొగడ్తలతో ముంచేశారు.

జాన్వీ కపూర్ తన కర్లీ కురులను మధ్యపాపిట తీసి లూజ్‌గా వదిలింది. మినిమల్ మేకప్‌తో మెస్మరైజ్ చేసింది. కనులకు న్యూడ్ ఐ ష్యాడో, బ్లాక్ ఐ లైనర్, మస్కరాను దిద్దుకుంది. పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టకుని గ్లామరస్ లుక్స్‌తో యూత్‌ను అట్రాక్ట్ చేసింది.