Viral Video : వన్యప్రాణులతో మెలిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి అవి మనల్ని చూసి భయపడినట్లు కనిపించిన మాత్రాన అవి మనకు లొంగిపోయాయి అనుకోకూడదు. వాటి ప్రవర్తనను మనం అంచనా వేయలేం. దానికి ఉదాహరణే ఈ వీడియో. దీన్ని చూసిన వారు రకరకాలుగా తమ రియాక్షన్‌ను తెలుపుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కాలం పిల్లలకు ఇదో పాఠంలా పనికొస్తుందని చాలామంది భావిస్తున్నారు. అసలు ఈ వీడియో ఏంటి? అంతలా ఇందులో ఏముంది అని అనుకుంటున్నారా? అయితే తెలుసుకోండి.
మొసళ్లను మనం బయట ప్రపంచంలో పెద్దగా చూడం. ఇవి నీటితోపాటు నేలపైనా కూడా బ్రతకగలవు. వీటి పళ్ళు చాలా గట్టిగా ఉంటాయి. అందుకే ఇవి నోటితో ఏదైనా జంతువుని పట్టాయి అంటే వదలవు. అంతేకాకుండా నేలపై కూడా చాలా వేగంగా కదలగలవు. అలాంటి మొసలికీ, ఓ కుక్క పిల్లకీ మధ్య జరిగిన ఘర్షణకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొసలిని బలాన్ని తక్కువ అంచనా వేసిన ఓ కుక్క పిల్ల ఎలా ఇబ్బందులు పడింది అన్నదే ఆ వీడియోలో సారాంశం.
ఇంతకీ ఏం జరిగింది
ఓ ఇంటి పక్కనే ఉన్న చెరువులో ఉంటున్న మొసలి రోజూ ఒడ్డుకి వస్తోంది. ఇది గమనించిన ఆ ఇంటి కుక్కపిల్ల.. ఓ రోజు దాని దగ్గరకు వెళ్లి అరిచింది. అయితే కుక్కపిల్లను చూసి కంగారుపడిన మొసలి వెంటనే నీళ్లలోకి వెళ్లిపోయింది. ఇది గమనించిన ఆ ఇంటి యజమాని సంబరపడిపోయాడు. మా పప్పీ సూపర్ అంటూ మురిసిపోయాడు. అయితే ఇలాంటి సందర్భమే మరలా మొసలికి ఎదురయ్యింది. అప్పుడు కూడా కుక్క పిల్ల దాన్ని తరిమేసింది. అయితే అత్యుత్సాహానికి పోయిన కుక్కపిల్ల మొసలి వెళ్లిపోతున్నప్పుడు దాని తోకను కరిచేందుకు ప్రయత్నించింది. అప్పుడు కూడా ఆ ఇంటి సభ్యులు పప్పీ సూపర్ అంటూ దానిని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే మూడోసారి అదే విధంగా వచ్చిన మొసలి పక్కా ప్లాన్ వేసింది. ఈసారి పప్పీ ఆటలు దాని దగ్గర సాగలేదు. ఆ మొసలి చేసిన పని ఇప్పుడు అందర్నీ ఆలోచనలో పడేస్తుంది.
Viral Video :
ఈసారి మొసలి తెలివిగా తన తోకను నీటివైపు ఉంచి తలను కుక్కపిల్ల వైపు ఉంచింది. ఇది గమనించని కుక్కపిల్ల మొసలి తోక అనుకొని దాని చేతికి దొరికిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో బాగా వైరలవుతోంది. ఈ వీడియోని చూసిన చాలామంది నెటిజన్లు ఎందుకు కుక్కపిల్లని ముసలి దగ్గరికి వెళ్ళనిచ్చారని ఆ ఇంటి యజమానిపై ఫైర్ అవుతున్నారు. కుక్కపిల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని కొంతమంది ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. అయితే వణ్యప్రాణులతో జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో చూసి మనందరం తెలుసుకోవచ్చు.
Fking retard owners pic.twitter.com/kObPezUJnz
— Lo+Viral 🔥 (@TheBest_Viral) October 25, 2022