Bigg boss 6 : బిగ్ బాస్ సీజన్ 6లో చిరాకు తెప్పించే క్యాండిడేట్ ఎవరంటే అంతా తడుముకోకుండా చెప్పే ఒకే ఒక్క పేరు గీతూ రాయల్. హౌస్‌మేట్స్ పట్ల ఆమె ప్రవర్తన, మాట్లాడే విధానం వామ్మో ఓ రేంజ్‌లో ఉంటుంది. బిగ్‌బాస్ ఇచ్చిన అలుసో.. ప్రతివారం హోస్ట్ నాగార్జున ఇస్తున్న బూస్టో కానీ ఆమె వ్యవహార శైలి మాత్రం హద్దులు దాటేసింది. అయితే గత వారం మాత్రం నాగ్ బాగానే ఆమెకు క్లాస్ పీకారు. ఆ సమయంలో కూడా ‘నేనున్న సీజన్ డల్ అవకూడదని కంటెస్టెంట్స్‌ని రెచ్చగొట్టా’ అంటోంది. దీనికి బయట వస్తున్న ట్రోల్స్ చూస్తే గీతూ ఏమైపోతుందో పాపం.
హౌస్‌లో నుంచి ఎవరైనా ఎలిమినేట్ అయినా గీతూలో పెద్దగా రియాక్షనే కనిపించదు. అసలు ఆమెకు ఎమోషన్స్ అంటూ ఏమీ లేవు. ఇది ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది కూడా. తనను ఏడిపించాలని బిగ్‌బాస్‌కే సవాల్ విసురుతుంది. అలాంటి గీతూ ఆదివారం బోరున ఏడ్చింది. కెమెరాకు అయితే ఫేస్ చూపించలేదు కానీ ఏడవడం మాత్రం బరాబర్ ఏడ్చేసింది. ఈ ఏడుపు మరెందుకో కాదు.. తన పప్పెట్ అదేనండీ ఆదిరెడ్డి ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాడోనని గుక్కపెట్టి మరీ ఏడ్చింది. ఏంటో ఆమె ఏడుపు కూడా చిరాకుగానే అనిపిస్తుంది చూసే వాళ్లకు. ఎక్కడా జెన్యూనిటీ కనిపించదు.
గతవారం బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ అందరినీ నామినేషన్స్‌లోకి లాగిన విషయం తెలిసిందే. శనివారమే సూర్యను ఎలిమినేట్ చేసేశారు నాగార్జున. ఇక ఆదివారం ఒక్కొక్కరినీ సేవ్ చేయగా.. చివరకు ఆదిరెడ్డి, మెరీనా మిగిలిపోయారు. వీళ్లిద్దరిలో ఒకరి ఎలిమినేషన్ అని ఫిక్స్ పోయారు హౌస్‌మేట్స్. ఇక ఈ క్రమంలోనే తన పప్పెట్ హౌస్ నుంచి వెళ్లిపోతే తన మాట వినేవారు ఉండరు అనుకుందో ఏమో కానీ గీతూ ఆది రెడ్డి చేయి పట్టుకుని మరీ వెళ్లొద్దని బోరున విలపించింది. అతను వెళ్లిపోతే తనను అర్ధం చేసుకునే వారే ఉండరని వాపోయింది. తన కోసం స్టాండ్ తీసుకునే వారుండరని లబోదిబోమంది. ఇది చూసిన నెటిజన్లు ఆమె హైడ్రామాకు ఒక దండం రా సామి అంటున్నారు. ఇక ఈ వారం నో ఎలిమినేషన్ అని నాగ్ చెప్పడంతో అంత హ్యాపీగా ఫీలయ్యారు.