Sri Satya – Arjun Kalyan Relationship : అర్జున్ కళ్యాణ్‌తో తన కూతురి రిలేషన్‌షిప్‌పై శ్రీ సత్య తండ్రి శ్రీనివాస ప్రసాద్ స్పందించారు. వారిద్దరూ స్నేహితులు మాత్రమేనని.. అంతకు మించి ఏమీ లేదని స్పష్టం చేశారు. తాజాగా శ్రీనివాస ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధాంతో అర్జున్, శ్రీ సత్య ఒకే రంగంలో ఉండటంతో మంచి స్నేహితులయ్యారని చెప్పుకొచ్చారు. అర్జున్‌తో ఉన్న స్నేహం గురించి బిగ్‌బాస్‌కి వెళ్లడానికి ముందే శ్రీ సత్య తనకు చెప్పిందని శ్రీనివాస ప్రసాద్ వెల్లడించారు.
ఈరోజుల్లో అన్నా చెల్లెళ్లు వెళుతున్నా కూడా ఎవడో ఒకడు కామెంట్ చేస్తూనే ఉన్నాడన్నారు. ఈ క్రమంలో అర్జున్ కల్యాణ్, శ్రీ సత్యల మధ్య రాపో చూసి అలా కొన్ని ఛానెళ్ల వాళ్లు అలా క్రియేట్ చేశారని చెప్పుకొచ్చారు. కానీ వాళ్లిద్దరూ మంచి స్నేహితులని.. శ్రీసత్య తల్లి ఆరోగ్యం గురించి తెలుసు కాబట్టే అర్జున్ తాను చూసుకుంటానని చెప్పాడన్నారు. దాన్ని కూడా కొన్ని చానెళ్లు రేటింగ్స్ కోసం వక్రీకరించాయని శ్రీనివాస ప్రసాద్ చెప్పుకొచ్చారు. అర్జున్ చాలా మంచి వ్యక్తని కితాబిచ్చారు. కానీ అర్జున్ నేరుగా శ్రీ సత్యపై తనకు క్రష్ ఉందని చెప్పుకొచ్చాడు.
అర్జున్ వ్యాఖ్యలపై శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ.. తనకు తెలిసి అర్జున్ మంచి స్నేహితుడేనని క్రష్ ఉందని ఎందుకు చెప్పాడో తెలియదన్నారు. అసలు అతనే అలా చెప్పాడో లేదంటే ఎవరైనా అతని చేత చెప్పించారో తెలియదనడం ఆసక్తికరం. అలాంటివి చేస్తేనే టీఆర్పీ పెరుగుతుందని.. అందుకే అలా చేసి ఉండొచ్చని కూడా చెప్పుకొచ్చారు. అర్జున్ బయటకు రావడంలో శ్రీసత్య ప్రమేయమేమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. అందరితో కూడా శ్రీ సత్య ఒకేలా మెలుగుతుందని.. అర్జున్‌ని తరచూ రిజెక్ట్ చేయడం.. తనను టచ్ చేయకుండా మాట్లాడాలనడం వంటి అంశాలను ఈ సందర్భంగా శ్రీ సత్య తండ్రి ప్రస్తావించారు. అర్జున్‌కి ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయేమో తెలియదు కానీ తన కూతురు మాత్రం జెన్యూన్ అని శ్రీనివాస ప్రసాద్ చెప్పుకొచ్చారు.