Vastu Tips ఈ మధ్య కాలంలో వాస్తు శాస్త్రానికి ప్రాముఖ్యత బాగా పెరిగింది. ఇల్లు మొదలయినప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రతి పని వాస్తు ప్రకారం జరుగుతుందా లేదా అని ఖచ్చితంగా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల. ఈ కలని సాకారాం చేసుకోవడానికి ఎంతో శ్రమించి డబ్బును కూడబెట్టుకుంటారు. అలా వచ్చిన ప్రతి పైసాని ఇంటి నిమిత్తమే ఖర్చు పెట్టుకుంటారు.
కాబట్టి ఇంటి నిర్మాణంలో జాగ్రత్తలు తప్పకుండా పాటిస్తున్నారు. మంచి ముహూర్తం చూసుకొని మొదలు పెట్టడం మరియు మంచి ఘడియలు చూసుకొని గృహ ప్రవేశం చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా వాస్తు శాస్త్రంపై కూడా దృష్టి పెట్టారు. అలా ఏ దిక్కులో ఏ వస్తువులు పెట్టుకోవాలి. ఏ దిక్కులో ఏ గది ని నిర్మించుకోవాలి. ద్వారం ఎటు వైపు ఉండాలి అనేది కూడా వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.
ఈరోజు నైరుతి దిశలో ఎటువంటి వస్తువులు పెడితే మనకు దానం ప్రాప్తిస్తుంది అనే విషయాలను తెలుసుకుందాం. నైరుతిలో భారీ వస్తువులను పెట్టుకోవాలని వాస్తు శాస్త్రంలో రాసి ఉంది. ఈ దిశలో వార్డ్ రోబ్ ని ఏర్పాటు చేసుకుని అందులో డబ్బు, నగలు వంటివి దాచుకుంటే ఆర్ధిక పరమైన ఇబ్బందులు తొలిపోతాయట.
Vastu Tips
ఇంకా నైరుతి దిశలో విండ్ చైమ్స్, పిరమిడ్స్ మరియు మనకు శుభాన్ని సూచించే మొక్కలు నాటినట్టయితే ఇంట్లో ఐశ్వర్యంతో పాటు చికాకులు కూడా తొలగిపోతాయట. ఇంకా కొంత మంది నైరుతి దిశలో తమ ద్వారాన్ని ఏర్పరుచుకొంటారు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలకు కారణమవుతుంది అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ద్వారం వద్ద గణేశుడి విగ్రహం ఏర్పాటు చేస్తే దోషాలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.