Vastu: మనలో చాలామందికి తెలియక చేసే అనేక తప్పులు వారికి అనేక రకాలుగా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. నిజానికి వాస్తు ప్రకారం చాలా నియమాలు ఉంటాయి. వాటిని సరిగ్గా పాటిస్తే ఎలాంటి ఇబ్బంది రాదు. కానీ చాలామందికి వాస్తుకు సంబంధించిన వివిధ విషయాల మీద అవగాహన లేకపోవడంతో ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి. ఫలితంగా అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. ఇంతకీ వాస్తు ప్రకారం ఏం అలవాట్లను మార్చుకోవాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
చెత్త డబ్బాను అక్కడ పెట్టకండి:
మనం ఇల్లు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో చెత్త డబ్బాను వాడుతుంటాం. అయితే ఆ చెత్త డబ్బాను ఎక్కవ పెట్టకూడదనే విషయం చాలామందికి తెలియదు. వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్ వద్ద చెత్త డబ్బాను ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల లక్ష్మీ దేవికి ఆగ్రహం వచ్చి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయట.
బాత్ రూం డోర్ల విషయంలో జాగ్రత్త:
చాలామందికి బాత్ రూంని వాడిన తర్వాత దానిని మూయడం మరిచిపోతుంటారు. తలుపులు మూయడం అనేది వాస్తు ప్రకారం ఎంతో కీలకం. మీరు తరుచూ బాత్ రూం డోర్లను తెరిచి ఉంచితే నష్టం కలుగుతుందట.
బెడ్ రూం, పూజ రూంలో ఇవి పెట్టకండి:
వాస్తు ప్రకారం బెడ్ రూం మరియు పూజ గదిలో కొన్ని వస్తువులను అస్సలు ఉంచుకోకూడదు. బెడ్ రూంలో మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. ఇక కొంతమంది బెడ్ రూంలో పూజ గదిని ఏర్పాటు చేస్తుంటారు. వాస్తు ప్రకారం ఇది దోషంగా పరిగణించబడుతుంది.
వంటగదిలో ఇవి ఉంటే తీసెయ్యండి:
వంట గదిలో వాస్తు ప్రకారం మందులను ఇవ్వకూడదు. వంట గదిలో మందులను ఉంచడం వల్ల ఆరోగ్యం తరుచూ క్షీణిస్తుందట. నిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్యతో అందరూ బాధపడుతూ ఉంటారట.
Vastu: ఇంటి ఆవరణలో ఇవి ఉండకూడదు:
వాస్తు ప్రకారం ఇంటి ఆవరణలో తెల్లటి పాలు కారే చెట్లు మరియు ముళ్ల మొక్కలు ఉండకూడదు. ఇవి ఉంటే మాత్రం ఆ ఇంటికి ఆర్థిక కష్టాలు మొదలవుతాయి.