బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంది. అలాగే వివాదాలకి కేరాఫ్ గా ఉంటూ వివాదాస్పద నటిగా కూడా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో నెపొటిజం మీద ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. ఇదిలా ఉంటే కంగనా బీజేపీ పార్టీ సపోర్తర్ అనే సంగతి తెలిసిందే. ఈ అమ్మడు తరుచుగా ప్రధాని నరేంద్ర మోడీ మీద ప్రశంసలు కురిపిస్తుంది. అలాగే బీజీపీ పార్టీ కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది. ఈ నేపధ్యంలో చాలా కాలంగా కంగనా రనౌత్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తుందనే టాక్ వినిపిస్తుంది.
ముఖ్యంగా బీజేపీ పార్టీ సపోర్టర్ కావడం ఆ పార్టీ నుంచి కంగనా రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తుందని చాలా మంది భావిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆమె కూడా కన్ఫర్మ్ చేసింది.హిమాచల్ ప్రదేశ్ లో ఎంపీ టికెట్ ఇస్తే బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పింది. హిమాచల్ ప్రదేశ్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా రనౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇక్కడి ప్రజలు కోరుకుంటే, బీజేపీ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని చెప్పింది. ఇక బీజేపీ పార్టీ కూడా కంగానా లాంటి పవర్ ఫుల్ వాయిస్ ఉన్న వాళ్ళని లీడర్స్ గా ఎంకరేజ్ చేస్తుంది.
ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికలలో కంగనా రనౌత్ ఎన్నికలలో పోటీ చేసి రాజకీయాలలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ మీద కూడా కంగనా ప్రశంసలు కురిపించింది. మోడీ మహాపురుష్ అంటూ పోగిడేసింది. అలాగే నరేంద్ర మోడీని ఎదుర్కొనే దమ్ము రాహుల్ గాంధీకి లేదని పేర్కొంది. అలాంటి నేత ఉండటం విచారకరం అంటూ కామెంట్స్ చేసింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుడు వాగ్దానాలు ఇస్తూ ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తుందని విమర్శలు చేసింది. ఇప్పుడు కంగనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే కంగనా కోరుకున్నట్లు ఆమెకి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీ టికెట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.